పలు జిల్లాల్లో మోస్తరు వర్షం.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడ్రోజుల నుంచి పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది.
- నేడు నాలుగు జిల్లాలకు వర్ష సూచన
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడ్రోజుల నుంచి పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్జ్ జారీ చేసినట్టు తెలిపింది. శనివారం నుంచి వాతావరణం పూర్తిగా సాధారణంగా ఉంటుందని, ఉక్కపోతలు మొదలవుతాయని వివరించింది.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 21గా నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నది. కాగా, గడిచిన 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో అత్యధికంగా 4.36 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా గూడూరులో 1.38 సెం.మీ. వర్షపాతం నమోదైందని తెలిపింది. సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసినట్టు వెల్లడించింది. మార్చి 1 నుంచి ఎండలు మండిపోతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

