కరెంట్ షాక్‌తో రైతు మృతి
వ్యవసాయ పొలంలో కరెంట్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై విక్రమ్ తెలిపిన వివరాల ప్రకారం.. నవాబ్‌పేట మండలం చిన్న మేఘ్యానాయక్ తండాకు చెందిన గిరిజన రైతు మేగావత్ వెంకటేశ్ (47) బుధవారం రాత్రి నీళ్లు పెట్టేందుకు పొలం వద్దకు వెళ్లాడు.
నవాబ్‌పేట, ఫిబ్రవరి 26 : వ్యవసాయ పొలంలో కరెంట్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై విక్రమ్ తెలిపిన వివరాల ప్రకారం.. నవాబ్‌పేట మండలం చిన్న మేఘ్యానాయక్ తండాకు చెందిన గిరిజన రైతు మేగావత్ వెంకటేశ్ (47) బుధవారం రాత్రి నీళ్లు పెట్టేందుకు పొలం వద్దకు వెళ్లాడు. విద్యుత్తు మోటర్ ఆన్‌చేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. వెంకటేశ్ భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
బెట్టింగ్‌లో నష్టపోయి యువకుడి ఆత్మహత్య
జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 26 : ఆన్లైన్ బెట్టింగ్‌లో రూ.25 లక్షలు నష్టపోయిన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్‌కు చెందిన గీత కార్మికుడు గర్వందుల మహేశ్ (37) ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటుపడి రూ.25 లక్షల వరకు పెట్టాడు. అవి తిరిగి రాకపోవడంతోపాటు అప్పులు చేసి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడిపి నష్టపోయాడు. దీంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మానసికంగా కుంగిపోయి బుధవారం రాత్రి గ్రామ శివారులోని రైతువేదిక ఇనుప పైపునకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

