అడుగంటిన పాలెం వాగు ప్రాజెక్టు
మండలంలోని మల్లాపురం, రాచపల్లి గ్రామ శివారులో నిర్మించిన పాలెంవాగు మధ్యతరహా ప్రాజెక్టులో నీరులేక అడుగంటింది. దీంతో పంటలకు సాగు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టు కింద యాసంగిలో రైతులు సమారు రెండు వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. యాసంగిలో నారు మడి పోసినప్పటి నుంచి నాట్లు వేసి కలుపు తీసే వరకు ప్రాజెక్టు నుంచి సాగు నీరు బాగానే అందింది.
- పొట్ట దశలో సాగునీరు లేక ఎండుతున్న వరి
- పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన
వెంకటాపురం(నూగూరు), ఏప్రిల్ 20 : మండలంలోని మల్లాపురం, రాచపల్లి గ్రామ శివారులో నిర్మించిన పాలెంవాగు మధ్యతరహా ప్రాజెక్టులో నీరులేక అడుగంటింది. దీంతో పంటలకు సాగు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టు కింద యాసంగిలో రైతులు సమారు రెండు వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. యాసంగిలో నారు మడి పోసినప్పటి నుంచి నాట్లు వేసి కలుపు తీసే వరకు ప్రాజెక్టు నుంచి సాగు నీరు బాగానే అందింది. కాగా, వరి పొట్టకు వచ్చి కంకి వచ్చే దశలో ప్రాజెక్టులో నీరు అడుగంటింది. దీంతో రైతులు సాగు నీటి కోసం తంటాలు పడాల్సి వస్తున్నది.
ప్రాజెక్టు ప్రధాన గేటుకు అధికారులు మరమ్మతులు చేయించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంట చేతికి వచ్చే సమయంలో సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానకాలంలో నష్టాలను చూసిన రైతులు యాసంగి సాగులోనైనా కలిసి వస్తుందని ఆశ పడ్డితే సాగు నీరందక మళ్లీ నష్టాలనే చవిచూడాల్సి వస్తున్నది. పంటలపై పెట్టిన పెట్టుబడులు రాక అప్పలపాలవుతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

