ములుగురూరల్/మల్లంపల్లి, ఆగస్టు 8 : ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రం సమీపంలో జాతీ య రహదారి (ఎన్‌హెచ్)పై ఉన్న కెనాల్ బ్రిడ్జి కుంగిపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణంగా నిలుస్తున్న ది. ఎన్‌హెచ్ విస్తరణ పనుల్లో భాగం గా ఇక్కడ కొత్త బ్రిడ్జి నిర్మించాల్సి ఉండగా సదరు కాంట్రాక్టర్ ఆరు నెలలుగా సాగదీస్తూ వస్తున్నాడు. పనుల ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంతోనే బ్రిడ్జి కింద మట్టి కూలిపోయి కుంగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 40 ఏళ్ల క్రితం నిర్మించిన కాకతీయ కెనాల్‌పై రవాణా ఇబ్బందులు ఉండొద్దనే ఉద్దేశంతో మల్లంపల్లి వద్ద అప్పటి పరిస్థితులకు అనుగుణంగా బ్రిడ్జి నిర్మించారు.
బ్రిడ్జికి రెండు వైపులా రాళ్లతో రివిట్మెంట్ ఏర్పాటు చేసి కెనాల్లో నీళ్లు సాఫీగా వెళ్లేందుకు సిమెంట్ పైపులు వేశారు. వాటి పైనుంచి చాలా ఎత్తు వర కు మట్టి పోసి బ్రిడ్జి నిర్మించారు. 2004లో ఈ రహదారిని 365 జాతీయ రహదారిగా మార్పుచేశారు. అనంతరం ఈ రోడ్డును రెండు వరుసలుగా విస్తరించినప్పటికీ ఎన్‌హెచ్ అధికారులు మాత్రం పాత బ్రిడ్జిని అలాగే ఉంచారు. ఇటు గోదావరి నుంచి ఇసుక, అటు మల్లంపల్లి ప్రాం తంలోని ఎర్రమట్టి కోసం వందల సంఖ్యలో లారీలు రాకపోకలు సాగిస్తుండడంతో బ్రిడ్జి ద్ది కొద్దిగా కుంగిపోతూ వస్తున్నది.
ఈ క్రమంలో ఎన్‌హెచ్ అధికారులు 2010లో ఈ రహదారిని 365 నుంచి 163గా మార్పు చేశారు. మూడేళ్ల క్రితం గుడెప్పాడ్ నుంచి ములుగు గట్టమ్మ దేవాలయం వరకు రూ. 350 కోట్లతో నాలుగు లేన్ల విస్తరణ పనులు చేపట్టగా బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీనిని వేసవి వరకే పూర్తిచేయాల్సి ఉన్నప్పటికీ పనుల్లో జాప్యం, ప్రస్తు తం కురుస్తున్న వర్షాలు, నిత్యం భారీ వాహనాలు వెళ్లడం, సరైన ప్రణాళిక లేకుండా నిర్మిస్తుండడంతో బ్రిడ్జి కుంగిపోయింది.
బ్రిడ్జి కుంగిపోవడంతో వాహనదారులు, సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారు ఇబ్బందులు పడుతున్నారు. హనుమకొండ నుంచి వ చ్చే బస్సులతో పాటు ఇతర వాహనాలను గూడెప్పాడ్ నుంచి పరకాల, రేగొండ, జాకారం ద్వారా ములుగుకు మళ్లిస్తున్నారు. దీం తో వాహనదారులు 30 కిలో మీ టర్లు అధికంగా ప్రయాణించాల్సి వస్తున్నది. ములుగు నుంచి వెళ్లే వాహనాలను పందికుంట, రామచంద్రాపురం, శ్రీనగర్ క్రాస్ నుంచి మల్లంపల్లి మీదుగా హనుమకొండకు పంపిస్తుండడంతో 10 కిలోమీటర్ల దూరం పెరుగుతున్నది.
ముంద స్తు మొక్కుల కోసం మేడారం వస్తున్న భక్తులతో పాటు రామప్ప, బొగత, లక్నవరం, మల్లూరు కు వచ్చే పర్యాటకులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం ఉదయం బ్రిడ్జి ప్రాంతా న్ని సందర్శించిన ఎన్‌హెచ్ ఉన్నతాధికారులు, పోలీసులు వాహనాల రాకపోకలు పునరుద్ధరించేందుకు ఎడమవైపు తాత్కాలిక రోడ్డు నిర్మించే పనులను ప్రారంభించారు. అయితే వాన పడితే ఇదికూడా ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉం టుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు సరైన ప్రణాళికతో బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేయాలని కోరుతున్నారు.