వరి కోత యంత్రాలకు యమగిరాకీ
వ్యవసాయరంగంలో ప్రతీ సంవత్సరం నూతన మార్పులు వస్తున్నాయి. కూలీల కొరత కారణంగా రైతులు యంత్రాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఒకేసారి వరి సాగు కోతకు రావడంతో కోత యంత్రాలకు గిరాకీ పెరిగింది. కూలీలకు బదులు యంత్రాలతో గంటల వ్యవధిలోనే పంట ఉత్పత్తులు చేతికి అందివస్తుండడంతో రైతులు ఈ యంత్రాల వైపే మొగ్గుచూపుతున్నారు.
- హార్వెస్టర్ల వినియోగంపైనే రైతుల ఆసక్తి
- తక్కువ వ్యయం, త్వరగా పంట ఉత్పత్తులు చేతికి..
నర్సంపేట రూరల్, డిసెంబర్ 12 : వ్యవసాయరంగంలో ప్రతీ సంవత్సరం నూతన మార్పులు వస్తున్నాయి. కూలీల కొరత కారణంగా రైతులు యంత్రాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఒకేసారి వరి సాగు కోతకు రావడంతో కోత యంత్రాలకు గిరాకీ పెరిగింది. కూలీలకు బదులు యంత్రాలతో గంటల వ్యవధిలోనే పంట ఉత్పత్తులు చేతికి అందివస్తుండడంతో రైతులు ఈ యంత్రాల వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ సంవత్సరం కొంత ఆలస్యమైనప్పటికీ సమృద్ధిగా వర్షాలు కురవడంతో బావులు, చెరువులు, కుంటల కింద ఒకేసారి రైతాంగం వరి సాగుకు చేశారు. దాదాపు వరి ఒకేసారి కోతకు రావడంతో యంత్రాలకు భలే గిరాకీ వచ్చింది. రాష్ట్రం నుంచి గాక ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి వరికోత యంత్రాలు భారీగా తరలివచ్చాయి.
అన్ని గ్రామాల్లో హార్వెస్టర్ యజమానులు యంత్రాలను ఇప్పటికే దింపారు. ఎకరం వరి కోసేందుకు హార్వెస్టర్ యజమానులు రూ.2వేల నుంచి రూ.2200 తీసుకుంటున్నారు. చైన్ మిషన్కు మాత్రం రూ.3200ల నుంచి రూ.3600 వరకు చార్జి చేస్తున్నారు. ఒక ఎకరం వరిని వరికోత యంత్రాలు రెండు గంటల్లోపు కోస్తున్నాయి. వరి కోత యంత్రాల విధానమే బాగుందని పలువురు రైతులు అంటున్నారు. కూలీల సహాయంతో కోతకోసి, కుప్పపెట్టి, కుప్ప నూర్పిడి చేసే సరికి సుమారు ఎకరానికి రూ.8వేల నుంచి 9వేల వరకు ఖర్చు వస్తుందంటున్నారు. యంత్రాల సహాయంతో కోస్తే వరిగడ్డి అక్కెరకు రాకుండా పోతుంది. గడ్డి అవసరమున్న రైతులు తప్ప మిగతా వారంతా వరి కోతయంత్రాలను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. రైతుల అవసరాలను గమనించిన హార్వెస్టర్ యజమానులు గ్రామానికి ఒకటి రెండు చొప్పున యంత్రాలను తీసుకువచ్చి సొమ్ముచేసుకుంటున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్గా యువరాజ్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

