నయీంనగర్, నవంబర్16 : హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానంలో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటోషో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. బైకులు, కార్లు కొనాలనుకునే వారి అవసరాలను గుర్తించి ప్రముఖ కంపెనీలకు చెందిన వాహనాలను ఒకే వేదికపైకి తీసుకురాగా, ప్రజలు ప్రదర్శనకు విచ్చేసి తమ మనసుకు నచ్చిన కార్లు, ద్విచ క్ర వాహనాలు కొనుగోలు చేశారు.

ముందుగా స్టాళ్లను సందర్శించి, వివిధ కంపెనీల కార్లు, బైక్ మోడళ్ల వివరాలను తెలుసుకొని టెస్ట్ డ్రైవ్ చేశారు. కొందరు వెంటనే కార్లు, బైక్‌లను కొనుగోలు చేశారు.

బీఆర్ఎస్ నాయకుడు రాకేశ్‌రెడ్డి హాజరై ఎలక్ట్రిక్ వాహనాన్ని టెస్ట్ డ్రైవ్ చేశారు. కాగా, స్టాళ్ల సందర్శనకు వచ్చిన వారిని ప్రోత్సహించేందుకు ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ బంపర్ డ్రా ఏర్పాటు చే సింది. ఇందులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.

కార్యక్రమంలో బ్రాంచి మేనేజర్ పందిళ్ల అశోక్ కుమార్, ఎడిషన్ ఇన్చార్జి నల్లపురి విద్యాసాగర్, బ్యూరో ఇన్చార్జిలు పిన్నింటి గోపాల్, నూర శ్రీనివాస్, ప్రొడక్షన్ చీఫ్ మేనేజర్ వేణుగోపాల్, యా డ్స్ మేనేజర్ అప్పని సూరయ్య, సర్క్యులేషన్ మేనేజర్ ఏడెల్లి సురేశ్‌రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ నజీర్, స్టోర్ ఎగ్జిక్యూటివ్ ఖదీర్, సీనియర్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ నిరంజన్, అన్ని విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. కాగా, కార్యక్రమానికి వ్యాఖ్యాతగా నిమ్మల శ్రీనివాస్ వ్యవహరించారు.

కియా సోనెట్ అతి తక్కువ ధరలోనే అద్భుతమైన ఫీచర్స్, సన్‌రూప్, 16 ఇంచ్ అలాయ్ వీల్స్, సీట్, లెదర్ ఇంటీరియర్, వైర్లెస్ చార్జర్, పుష్ బటన్, బ్యాక్ సీట్ 60:40 స్లిట్సీ సీట్స్, అంబ్రెస్ట్ విత్ కప్ హోల్డర్ ధర కేవలం రూ. 9,10,000కే లభిస్తుంది. మరిన్ని వివరాలకు మాలిక్ కియా, రంగంపేట వరంగల్ షోరూంకి రండి.
– రంజిత్ కుమార్ టీం లీడర్, మాలిక్ కియా ములుగు రోడ్డు, వరంగల్
ఈ ఆటో షో ద్వారా కియా కేరెన్స్ కారు కొన్నాను. అన్ని షోరూం తిరగాల్సి న పని లేకుండా అయిపోయింది. ఇక్కడ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జనాలకు ఎంతోగానో ఉపయోగకరం.
– మహ్మద్ మీర్ మొహినుద్దీన్
మేము హైదరాబాద్‌లో ఉంటాం. అయితే ఎప్పటి నుంచో కారు కొనాలనే ఆలోచన ఉండేది. హనుమకొండలో ఆటోషో పెట్టారనే విషయం తెలియగానే అన్ని వాహనాలు ఒకే వేదికపై ఉంటాయని భావించి ఇక్కడికి వచ్చాం. ఇక్కడి సిబ్బంది చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అలాగే ఏర్పాట్లు కూడా బాగా చేసిండ్లు. లోన్లు తీసుకునేందుకు కూడా బ్యాంక్ వారు ఇక్కడ ఉన్నారు.
– అడ్డగిరి శ్రావణి, హైదరాబాద్
ఆటో షో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. పేపర్లో ఆటో షో గూర్చి చూసి వచ్చి సిట్రాన్ కారును కొన్నాం. మాలాంటి కస్టమర్ల కోసం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా బాగుంది. ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే’కు కృతజ్ఞతలు.
– రామంచ సారంగపాణి, కాజీపేట
ఆటో షో ఏర్పాటు చేశారనే విషయం తెలిసి వచ్చాం. అన్ని కార్లు ఒకే దగ్గర ఉంటాయి. మనం అన్ని షోరూంలు తిరగాల్సిన అవసరం లేదని ఫ్యామిలీతో కారు కొనడానికి ఇక్కడికి వచ్చాం. వివిధ రకాల కంపెనీల కార్లు అందుబాటులో ఉన్నాయి. ఇది వాహనాలు కొనే వారికి మంచి అవకాశం.
– శ్రావణి, హంటర్‌రోడ్డు
ఆటో షోలో నిర్వాహకులు ఏర్పాటు చేసిన సదుపాయాలు బాగున్నాయి. నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే వారు ఆటో షో పెట్టారంటే వారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కారనే విషయం తెలుసు. స్విఫ్ట్ కారు కొనేందుకు వచ్చి, కొటేషన్ తీసుకున్నాం. త్వరలోనే కారును ఇంటికి తీసుకెళ్తాం.
– బుస్సారి రిషిత, నక్కలగుట్ట
నమస్తే తెలంగాణ పేపర్లో ఆటో షో గూర్చి చూసి ఇక్కడకు వచ్చి జుపీటర్ బైక్‌ను కొన్నాం. నిర్వాహకులు ఏర్పాట్లు బాగా చేశారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. అన్ని వాహనాలను ఒకే దగ్గరికి తీసుకువచ్చి, మాలాంటి కస్టమర్ల కోసం ఆలోచన చేయడం చాలా సంతోషంగా ఉంది.
– జాజుల జ్ఞాన చందర్, జమ్మికుంట
‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో షో ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆదివారం ఆటో షో ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై లక్కీ డ్రాలో విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం స్టాల్స్‌ను పరిశీలించి మాట్లాడారు. వార్తా పత్రికలు వార్తలు రాసి జనాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడమే కాకుండా జనాల కోసం ఆలోచించి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషంగా ఉంది.
– బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్