ఏటూరునాగారం: రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొని గోల్డ్ సిల్వర్ మెడల్ సాధించిన క్రీడాకారులను శుక్రవారం ఉదయం ఏటూరునాగారంలోని (Eturnagaram) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో వాకర్స్ అసోసియేషన్ తరపున సన్మానించి అభినందనలు తెలిపారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలో ఈనెల 4 నుంచి 6వ తేదీ వరకు జరిగిన జూనియర్ అండ్ బాల్ హ్యాండ్ బాల్ పోటీల్లో ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన క్రీడాకారులు పాల్గొని గోల్డ్, సిల్వర్ మెడళ్లు సాధించారు. వరంగల్ జట్టు నుంచి బాల బాలికల హ్యాండ్ బాల్ పోటీలో మండల కేంద్రం చెందిన జాడి రాధిక, ఇమ్రాన్ జాడివాసు పాల్గొన్నారు. బాలికల హ్యాండ్ వాల్ పోటీలో జాడి రాధిక గోల్డ్ మెడల్ సాధించగా, ఇమ్రాన్ జాడివాసు బాలుర విభాగం నుంచి పాల్గొని సిల్వర్ మెడల్ సాధించినట్లు కోచ్ పర్వతాల కుమారస్వామి తెలిపారు. ఈ మేరకు వాకర్స్ అసోసియేషన్ తరపున క్రీడాకారులను అభినందించారు. మరిన్ని పతకాలు సాధించి భవిష్యత్తులో రాణించాలని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కోరారు
క్రీడాకారులు ఇదే మైదానంలో శిక్షణ పొంది హాండ్ బాల్ పోటీల్లో రాణించడం సంతోషకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ వరప్రసాదరావు, రేంజ్ ఆఫీసర్ నరేందర్, వాకర్స్ అసోసియేషన్ బృందం చిటమట రఘు, వావిలాల ఎల్లయ్య, ఎర్రల ఎల్లయ్య, పాలకుర్తి శ్రీనివాస్, ముక్కెర బిక్షపతి, వావిలాల సాంబశివరావు, వావిలాల స్వామి, రాజబాబు దుర్గారావు, వావిలాల నరసింహారావు, వెంకటేశ్వర్లు, ప్రభాకర్, చందర్రావు తదితరులు పాల్గొన్నారు.