ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాటి చెట్టు పై నుంచి పడి ఓ గీత కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన తాడ్వాయి మండలం నార్లపూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల ఎల్బాక గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన బుర్ర కనకయ్య(53) అనే గీత కార్మికుడు ఎప్పటిలాగే కల్లు తీసేందుకు ప్రయత్నస్తుండగా ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుంచి పడి మృతి చెందాడు.కనకయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.