ములుగు : జిల్లాలోని వెంకటాపురం నూగూరు మండలం పాత్రపురం వద్ద ఎడ్ల బండిని ఆటో ఢీకొనడంతో తొమ్మిది మంది గాయపడ్డారు. ఇందులో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఆరుగురుకి స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే..మండలంలోని ఎదిర గ్రామం నుంచి 15 మంది కూలీలతో వీఆర్కే పురం గ్రామానికి వస్తున్న ఆటో పాత్రపురం గ్రామం వద్ద ఎడ్ల బండిని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిని మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. తీవ్ర గాయాలైన ముగ్గురిని ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Gabba Stadium | నేలమట్టం కానున్న 130 ఏళ్ల స్టేడియం.. ఒలింపిక్స్ పోటీలే ఆఖరు..!
Foldable iPhone | ఆపిల్ నుంచి అదరిపోయేలా మడతపెట్టే ఫోన్..! ఫుల్ డీటెయిల్స్ ఇవే..!