Allu Arjun-Trivikram| ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు రూపొందుతున్నాయి. బడా హీరోలందరు కూడా పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. అయితే పుష్ప2తో సంచలన విజయం సాధించిన అల్లు అర్జున్ చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటనే సందేహం అందరిలో ఉంది. అయితే అట్లీతో చేస్తాడు అని ఒక టాక్ నడుస్తుండగా, లేదు లేదు త్రివిక్రమ్‌తో చేస్తాడు అని మరో టాక్ ఉంది. అయితే గతంలో అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం జులాయి. ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఆ తర్వాత వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి ఈ ఇద్దరి కాంబోలో తెరకెక్కగా, ఈ చిత్రం కూడా మంచి వసూళ్లే రాబట్టింది.
ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూడవ సినిమా అలా వైకుంఠపురంలో చిత్రం కాగా,ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే బన్నీ గత ఆరు సంవత్సరాలుగా పుష్ప ఫ్రాంచైజీతో బిజీగా ఉన్న నేపథ్యంలో వీరిద్ధరి కాంబోకి కాస్త సమయం పట్టింది. అయితే త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉందని, నిర్మాత నాగవంశీ తెలియజేయడమే కాకుండా.. ఈ సినిమా మొదటి వీడియో గ్లిమ్స్ కూడా విడుదల చేశారు. ఇందులో ఈ సినిమా ఎంతో గ్రాండ్ స్కేలుగా నిర్మించబడుతుందో తెలియజేశారు.
పురాణాల్లో ఎవ్వరికీ తెలియని కథను త్రివిక్రమ్ రాస్తున్నాడట. ఆ గాడ్ పేరు అందరూ విని ఉంటారని, కానీ ఆ గాడ్ జీవితంలో జరిగిన కథ మాత్రం ఎవ్వరికీ తెలియదని, ఆ కథనే తాము తెరకెక్కిస్తున్నామని అన్నాడు నాగవంశీ. అంటే అప్పట్లో వచ్చిన గాడ్ ఆఫ్ వార్ రూమర్ నిజమే అన్నట్టుగా కనిపిస్తోంది.కార్తికేయ స్వామి కథను త్రివిక్రమ్ రాస్తున్నాడని, దక్షిణాదికి ఆయన రాక.. ఇక్కడ ప్రజల్ని కాపాడేందుకు ఆయన రాక వెనుకున్న కారణం వంటి విషయాలని చిత్రంలో చూపించబోతున్నారని కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు నాగవంశీ మాటలని బట్టి చూస్తుంటే గాడ్ ఆఫ్ వార్ సినిమానే వారు తెరకెక్కిస్తున్నారా అనే అనుమానాలు అందరి మదిలో మెదులుతున్నాయి. కథ ఇంకా పూర్తి కాకపోవడం, స్క్రిప్ట్ ఇంకా రెడీ కాకపోవడంతో బన్నీ .. అట్లీతో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.