Seethakka | ములుగు జిల్లా : కాంగ్రెస్ నాయకుల ఇసుక దందాను పక్కదారి పట్టించడానికి 39 సంవత్సరాల క్రితం చనిపోయిన నా తండ్రి గురించి మాట్లాడడం సరైనది కాదని ములుగు మండల మాజీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొన్న మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) కొత్తగూడెం సభలో మాట్లాడే సందర్భంలో మా నాన్న సత్యనారాయణను 39 ఏండ్ల క్రితం నక్సలైట్లు చంపేశారు. సంబంధం లేని ఓ విషయాన్ని ప్రస్తావిస్తూ.. మా నాన్నను రాము చంపేశారని మాట్లాడారు. అప్పుడు నా వయస్సు 6 ఏండ్లు. మా బాబాయి, అమ్మ ఈ రోజుకు కూడా చెప్తరు. ఆ రోజుల్లో వీళ్లంతా ఊళ్లల్లోకి నక్సలైట్లు రాకుండా యూనిట్‌గా ఉన్నారు.
మనం ప్రభావితం కావాలి.. ఏదో ఒక విధంగా భయపెట్టాలని చెప్పి నక్సలైట్లు ఎంటరై మా నాన్నను అనుకోకుండా చంపేశారు. ఆ ప్రోగ్రాంలో వందకు వెయ్యి శాతం సీతక్క ఉన్నది. సీతక్కను మా అమ్మ చేతులు పట్టుకున్నది. మా బాబాయి కూడా చేతులు పట్టుకొని బతిమిలాడారు. అసలు మాకు సంబంధం లేని విషయంలో ఎందుకు అక్క ఇలా చేస్తున్నరని అడిగారు. అయినా కానీ తీసుకెళ్లి కొడ్తమని చెప్పి బెదిరించి చంపేశారు. నా తండ్రిని ముమ్మాటికి చంపింది అప్పటి నక్సలైట్లలో భాగమైన సీతక్కే.. నా తండ్రితో మాట్లాడి పంపిస్తాం అని చెప్పి శవాన్ని ఇంటికి పంపించారు..
ఈ ఉదంతాన్ని సతీష్ రెడ్డికి ఆపాదించడం దారుణం.. చనిపోయింది నా తండ్రి అయితే మనసులో ఏమైనా ఉంటే నాకు ఉండాలి కానీ సతీష్ రెడ్డికి ఏమి సంబంధమని రమేష్ రెడ్డి ప్రశ్నించాడు. సీతక్క తనయుడు కుంజ సూర్య, నేను ఈ రోజు కన్నతండ్రులను చిన్నప్పుడే కోల్పోవడానికి కారణం సీతక్కనే.. కాంగ్రెస్ నాయకుల ఇసక దందాలు భూదందాలు సెల్ఫోన్ల స్కాములు సతీష్ రెడ్డి బయట పెడుతున్నాడు అనే అక్కసుతో ఎప్పుడో 39 సంవత్సరాల క్రితం జరిగిన నా కుటుంబ ఉదంతాన్ని సతీష్ రెడ్డికి ఆపాదించి ఇది కేవలం తన స్వలాభం కోసమే చేస్తున్నాడని ములుగు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని రమేష్ రెడ్డి ఆరోపించారు.
Smart ration cards | తప్పులతడకగా స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ.. హరిపురంలో కార్డుల పంపిణీ నిలిపివేత