రాష్ట్రంలో ఎల్ నినో వల్ల కరువు ఛాయలు కనిపిస్తుండగానే.. హఠాత్తుగా ఆ పత్రికలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న వార్తలు పుంఖానుపుంఖాలుగా వస్తాయి. అయితే గియితే ఈ కరువు ఎల్ నినో పాపమే తప్ప.. పాపం సర్కార్ బాధ్యత ఏమున్నది? అనే భావన పాఠకుల మదిలో నాటే ప్రయత్నం. క్యాబినెట్ కీచులాటలు, వాటాల సిగపట్లు ఆ పత్రిక కండ్లకు అస్సలు కనపడవు. కేంద్రమంత్రి కొడుకు మీద పోక్సో కేసు నమోదైనా ఆ పత్రికలో ఆ వార్తే కనిపించదు. ఒకనాడు బాబును ఎంత మురిపెంగా చూసుకున్నదో, ఆకాశానికి ఎత్తుకున్నదో.. ఇపుడు బాబు బీ టీమ్ అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ సర్కార్‌ను కూడా అంతకు మించి లాలిస్తున్నది. ఎప్పుడో 1983 నాడు మొదలైన పచ్చ భజన.. ఇప్పటికీ అలా కొనసాగి.. కొనసాగి బాబు కు, ఆయన కుమారునికి, ఆఖరుకు ఆయన శిష్యులకు, బంట్లకు కూడా వర్తింపజేస్తున్నది.
సరే.. దాని పాలసీ భజనకే పరిమితమైతే పర్వాలేదు కానీ.. ఆ పరిధి దాటి ఎదుటి పక్షం మీద దాడికి దుష్ప్రచారానికి పూనుకోవడమే అభ్యంతరకరం. అందుకోసం కోర్టు వ్యవహారాలకూ వక్రీకరణలు జోడించడం దుర్మార్గం! రాజకీయ ప్రయోజనాల కోసం వంటకాలు అందించే పీఆర్వోలను నమ్ముకొని కథనాలు వండితే ఆఖరుకు వాంతులు విరోచనాల పాలు కాక తప్పదు! ఎప్పుడో 1983 నాడు మొదలైన పచ్చ భజన.. ఇప్పటికీ అలా కొనసాగి.. కొనసాగి బాబు కు, ఆయన కుమారునికి, ఆఖరుకు ఆయన శిష్యులకు, బంట్లకు కూడా వర్తింపజేస్తున్నది. సరే.. దాని పాలసీ భజనకే పరిమితమైతే పర్వాలేదు కానీ.. ఆ పరిధి దాటి ఎదుటి పక్షం మీద దాడికి దుష్ప్రచారానికి పూనుకోవడమే అభ్యంతరకరం. అందుకోసం కోర్టు వ్యవహారాలకూ వక్రీకరణలు జోడించడం దుర్మార్గం! రాజకీయ ప్రయోజనాల కోసం వంటకాలు అందించే పీఆర్వోలను నమ్ముకొని కథనాలు వండితే ఆఖరుకు వాంతులు విరోచనాల పాలు కాక తప్పదు!
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు విషయంలో తన స్వామిభక్తిని ప్రదర్శించుకునేందుకు ‘ఈనాడు’ అత్యుత్సాహం ప్రదర్శించింది. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో అర్ధసత్యాలు.. అసత్యాలను వండి వార్చింది. ఆ విషయం కోర్టు పరిధిలో ఉండగానే ఏకంగా ‘కేటీఆర్ పాస్‌పోర్టు తాత్కాలిక జప్తుకు ఆదేశాలు’ అంటూ ఓ అసత్య కథనాన్ని రాసింది. దీంతో ‘అదిగో పులి అంటే.. ఇదిగో తోక’ అన్న చందంగా.. కాంగ్రెస్ మీడియా, సోషల్ మీడియా ఏకంగా కేటీఆర్ పాస్‌పోర్టును జప్తు చేసేశారంటూ తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇంతకూ జరిగిందేంది? ఏసీబీ ఉన్నతాధికారులు ఈ నెల 26న ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఒక మెమో దాఖలు చేశారు.
దానినే కోర్టు ఆదేశంగా చిత్రిస్తూ ఓ అబద్ధాన్ని వండి వార్చింది. రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులపై ఇలాంటి కథనాలు రాసేముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలనే స్పృహ లేకుండా.. గుడ్డిగా ఓ అబద్ధాన్ని ప్రజల్లోకి నెట్టింది. దీంతో ఈ కేసులో కేటీఆర్ తప్పు చేశాడనే భావనే ప్రజల్లో బలవంతంగా రుద్దేలా ప్రయత్నం చేసింది. ఏసీబీ అధికారులు కోర్టుకు సమర్పించింది కేవలం మెమో మాత్రమే. అయితే, ఆ విషయాన్ని కోర్టు ఇంకా పరిశీలించలేదు. ప్రస్తుతానికి పరిగణనలోకి కూడా తీసుకోలేదు. బీఆర్ఎస్ న్యాయ నిపుణులు ఈ విషయం చెప్తున్నారు. ఈ విషయం ఇలా ఉంటే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు గానీ.. ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్‌కు గానీ, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డికి గాని, మాజీ స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావుకు గానీ ఎలాంటి నోటీసులు అందలేదని తేటతెల్లం అయింది.
పాస్‌పోర్టు ఆఫీసుకు లేఖ రాసినట్టు అబద్ధాలు..
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్‌తోపాటు మరో ముగ్గురు నిందితుల పాస్‌పోర్టులను తాతాలికంగా ఇంపౌండ్(తాత్కాలిక జప్తు) చేయాలని ఏసీబీ కోర్టు రీజినల్ పాస్‌పోర్ట్ అధికారికి లేఖ రాసినట్టు ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. అయితే, ఏసీబీ అధికారులు కేవలం ఏసీబీ ప్రత్యేక కోర్టులో పాస్‌పోర్టు ఇంపౌండ్ చేయాలని మెమో మాత్రమే సబ్మిట్ చేశారు. అది రొటీన్‌గా జరిగే వ్యవహారం. దానిని కోర్టు ఇంకా పరిశీలించలేదని, దాని ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయ అధికారి(ఆర్పీవో)కి కోర్టు ఎలాంటి లేఖ రాయలేదని బీఆర్ఎస్ న్యాయవాద బృందం చెబుతున్నది. ఒకవేళ కోర్టు ఆర్పీవోకు లేఖ రాసినా.. సూచన చేసినా, ఆదేశించినా.. దాని పై వివరణ కోరుతూ నిందితులుగా చెప్పబడుతున్నవారికి నోటీసులు అందజేయాలి. అటువంటి నోటీసులు వారెవరికీ రాలేదు.. కోర్టు పరిశీలించని అంశాన్ని కూడా పరిశీలించినట్టుగా.. పాస్‌పోర్టు ఇంపౌండ్ చేయాలని లేఖ రాసినట్టు వార్తాకథనాలు వండి వార్చడం ఏం నీతి? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
విచారణ, దర్యాప్తుల్లో లేని పాస్‌పోర్టు ప్రస్తావన
ఫార్ములా ఈ-కార్ రేసు కేసు నమోదైన నాటి నుంచి.. ఏసీబీ దర్యాప్తు, ప్రత్యేకంగా విచారణ, కోర్టు వాదనల్లోనూ ఇప్పటివరకు ఎక్కడా కూడా ఆయన పాస్‌పోర్టు విషయం చర్చకే రాలేదు. కేటీఆర్ ఈ కేసు నుంచి తప్పించుకొనే క్రమంలో విదేశాలకు పోతాడనీ ఎవరూ అననే లేదు. పైగా ‘మీరు ఎన్నిసార్లు పిలిచినా విచారణకు నేను వస్తాను’ అని కేటీఆర్ పదేపదే చెప్పారు. ఆ కారణంగానే ఆయన్ను అరెస్ట్ చేయకుండా దర్యాప్తు పూర్తిచేసి చార్జ్‌షీట్ దాఖలు చేశారు. అప్పుడు కూడా ఏ దర్యాప్తు సంస్థా కేటీఆర్ పాస్‌పోర్టు విషయం ప్రస్తావించలేదు. చార్జిషీట్ అనంతరం ఇటీవల కేటీఆర్ ఏసీబీ కోర్టుకు హాజరైనప్పుడు కూడా కోర్టు ప్రక్రియలో భాగంగా వ్యక్తిగత బాండ్, ష్యూరిటీలను సమర్పించారు. అప్పుడూ పాస్‌పోర్టు ప్రస్తావన రాలేదు. సెప్టెంబర్ 18న కూడా కేటీఆర్ ఏసీబీ కోర్టుకు రెండోసారి హాజరయ్యారు. ఆ సందర్భంగా పాస్‌పోర్టు సమర్పించాలని కోర్టు ఆదేశించలేదు. దర్యాప్తు సమయంలోనూ అధికారులు పాస్‌పోర్టు ఇవ్వాలని కోరలేదు. రెండేండ్లుగా సాగుతున్న ఈ కేసులో ఎప్పుడూ రాని పాస్‌పోర్టు ప్రస్తావన ఇప్పుడే ఎందుకొచ్చింది? అనే అనుమానాలు తలెత్తుతు న్నాయి. ‘ముఖ్యనేత’ ఒత్తిడిలో భాగంగానే ఏసీబీ అధికారులు పాస్‌పోర్టు అంశాన్ని లేవనెత్తారని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కోర్టులు, ప్రజలను తప్పుదారి పట్టించడమే..
నిందితులుగా చూపబడుతున్న వారికి ఎలాంటి నోటీసులు రాకుండానే.. ఆ కేసును వాదిస్తున్న న్యాయవాదులకు సమాచారం ఇవ్వ కుండానే.. బాధితుల వివరణ తీసుకోకుండానే.. ఆ విషయంపై కోర్టులో వాదనలు జరుగకుండానే ఏకంగా కోర్టే ఆదేశాలు ఇచ్చిందని రాయ డం.. కోర్టును, న్యాయవ్యవస్థలను తప్పుదారి పట్టించడమే. సాధారణ న్యా య ప్రక్రియలో.. కోర్టు ముందు ఏదైనా అభ్యర్థన దాఖలైన తర్వా త.. దానిని పరిశీలించిన తర్వాత సంబంధిత పక్షాలకు కోర్టులు నోటీసులు జారీ చేస్తాయి. వారి వివరణ వింటాయి.
ఈ కేసులో, ప్రత్యేకించి పాస్‌పోర్టుల తాత్కాలిక జప్తు విషయంలో అసలు ఎవరికీ ఎలాంటి నోటీసులు రానే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసును వాదిస్తున్న న్యాయవాదుల బృందం చెప్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ కేసు నమోదైనప్పుడే.. ‘ఇది ముమ్మాటికీ రాజకీయ కక్షసాధింపు కేసే.. ఇదొక లొట్టపీసు కేసే’ అంటూ కేటీఆర్ పదేపదే చెప్తున్నారు. ఆ తర్వాత కూడా ఆయన ఏసీబీ అధికారులకు, ఇదే కేసులో విచారించిన ఈడీ అధికారులకు పూర్తిగా సహకరించారు. ్ల విచారణకు పిలిచినా ‘మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాను.. న్యాయవ్యవస్థలపై నాకు నమ్మకం ఉంది’ అంటూ చెప్పారు. ఈ కేసులో వాస్తవాలను తన న్యాయవాదుల ద్వారా కోర్టుకు, మీడియాకు వెల్లడించిన కేటీఆర్.. దర్యాప్తు సమయంలో కేటీఆర్ ఏసీబీకి, ఈడీకి పూర్తిగా సహకరించారు.