ములుగు : సమస్యలు పరిష్కరించాలని మిషన్ భగీరథ కార్మికులు ధర్నా(dharna) చేపట్టారు. ఏటూరు నాగారం మండల కేంద్రంలోని రోహీర్ సెగ్మెంట్లో పనిచేస్తున్న మిషన్ భగీరథ కార్మికులు గత మూడు నెలల నుంచి జీతాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం రోహీర్ గ్రామంలోని మిషన్ భగీరథ పంప్ హౌస్ ముందు ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి కార్మికుడికి వెంటనే ఐడీ కార్డు ఇవ్వాల్నారు. అలాగే ప్రతి కార్మికుడికి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మూడు నెలల నుంచి ఇవ్వాల్సిన జీతాలు వెంటనే విడుదల చేయాలన్నారు. రెండు సంవత్సరాల నుంచి పెరగాల్సిన జీతాలు వెంటనే పెంచి ఏప్రిల్ నుండి అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.