ములుగు : ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో భగీరథ ఓఎఫ్సీ కేబుల్ బండిళ్లు దగ్ధమైన సంఘటన జిల్లాలోని మంగపేట మండలం కమలాపురం గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మిషన్ భగీరథ పనుల నిమిత్తం గత కొంత కాలంగా ఓఎఫ్సీ కేబుళ్లను గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదురుగా నిల్వచేశారు.
ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ఆకతాయిలు చెత్తను కాల్చేందుకు ప్రయత్నించగా పక్కనే ఉన్న ఓఎఫ్సీ కేబుల్ పైపులకు అంటుకొని భారీ ఎత్తున మంటలు ఎగిసిపడి అక్కడే పార్క్ చేసిన పాత ఇండికా కారు కూడా పూర్తిగా దగ్ధమై నట్లు స్థానికులు తెలిపారు.
.