Dilraju | కన్నడ స్టార్ నటుడు యష్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ ప్యాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ (Toxic: A Fairy Tale for Grown-ups) తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులకు సంబంధించి ఒక భారీ డీల్ కుదిరింది. ఈ సినిమాకు చెందిన థియేట్రికల్ హక్కులను రికార్డ్ ధరకు సొంతం చేసుకున్నాడు టాలీవుడ్ అగ్ర నిర్మాత, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) అధినేత దిల్ రాజు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ‘టాక్సిక్’ పంపిణీ హక్కులను సుమారు రూ. 120 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఒక డబ్బింగ్ సినిమాకు ఈ రేంజ్లో పలకడం ఇదే తొలిసారి అని తెలుస్తుంది. ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. అదేరోజు బాలీవుడ్ నుంచి భారీ బడ్జెట్ చిత్రం రణ్వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ కూడా విడుదల కాబోతుంది. దీంతో ఈ రెండు చిత్రాల మధ్య బాక్సాఫీస్ వద్ద క్లాష్ ఖాయమని తెలుస్తుంది.
మరోవైపు ఈ గట్టి పోటీ కారణంగా అడివి శేష్ నటించిన ‘డెకాయిట్’ చిత్రం తన విడుదల తేదీని మార్చి 19 నుండి ఏప్రిల్ 10కి వాయిదా వేసుకుంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా వస్తున్న ‘టాక్సిక్’ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ మరియు మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
The chaos is beginning to unfold. #Toxic: A Fairy Tale for Grown-ups arrives in theaters across Andhra Pradesh and Telangana through @SVCRelease
Intoxicating the world from 19-03-2026.#DaddyIsHome #ToxicTheMovie#TOXIConMarch19th pic.twitter.com/wMevzZLeBj
— SVC Release (@SVCRelease) February 6, 2026