నార్నూర్ : ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ( MLA Kova Lakshmi) జన్మదిన వేడుకలను ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ శ్రేణులు( BRS Cadre ) శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీరామ్ జాదవ్ మాట్లాడుతూ.. నియోజకవర్గం అభివృద్ధికి అహర్నశలు కృషి చేస్తున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేసే ఎమ్మెల్యేకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలంటూ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ మాజీ జడ్పీటీసీ రాథోడ్ చారులత, సర్పంచ్ ల సంఘం మాజీ మండల అధ్యక్షుడు ఉర్వేత రూప్ దేవ్, ఐటీడీఏ మాజీ డైరెక్టర్ మడవి మాన్కు, మాజీ ఎంపీపీ తనయుడు కనక ప్రభాకర్, మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖాసిం, పట్టణ అధ్యక్షుడు ఫీరోజ్ ఖాన్, ఉపాధ్యక్షుడు రాథోడ్ శివాజీ, జిల్లా నాయకులు లోకండే చంద్రశేఖర్,ఆడా శ్రీ రామ్, మెస్రం మానిక్ రావ్, రాథోడ్ సుభాష్, సుల్తాన్ ఖాన్, అజయ్ తదితరులు ఉన్నారు.