మరిపెడ, జనవరి 30 : దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రకృతి ఒడిలో కోలాహలంగా నిర్వహించుకునే మేడారం సమ్మక్క-సారక్కల మహా జాతరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించాలని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాం డ్ చేశారు. మండలంలోని తాళ్ల ఊకల్ గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. హిందూ త్వ ముసుగులో అధికారం కైవసం చేసుకున్న కేంద్రం తెలంగాణలోని చరిత్ర కలిగిన వీరనారీమణుల జాతరకు జాతీయ హోదా కల్పించకపోవడం రాష్ట్రంపై చూపుతున్న వివక్షకు నిదర్శనమన్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్న కిషన్‌రెడ్డి మేడారం జాతరకు కనీస నిధులు మంజూరు చేయించి రాష్ర్టానికి న్యాయం చేయలేరా? అని ప్రశ్నించారు. దేశంలోని అన్ని రాష్ర్టాల నుంచి ఈ జాతరకు గిరిజన, ఆదివాసీ, నాగులు, గోండు, కోయజాతి, బడుగు బలహీన వర్గాలతో పాటు అన్నివర్గాల ప్రజలు వస్తారని, కేంద్రం గుర్తించి తక్షణమే నిధులు మంజూరు చేయాలని అన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక బీజేపీ నాయకు లు దొంగ దీక్షలు, ఆందోళనతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డా రు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విష యం మొదలుకుని వ్యవసాయ విద్యుత్ మోటర్లకు మీటర్లు బిగిస్తున్న కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని స్పష్టమవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమ లు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ పథకం యావత్తు దేశానికి ఆదర్శమని, పలు రాష్ర్టా లు తెలంగాణ పథకాలను అధ్యయనం చేస్తున్నాయ ని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తూ రాష్ర్టానికి రా వాల్సిన నిధులను విడుదల చేయడం లేదన్నారు. దళితబంధు పథకం ద్వారా రా్రష్ట్రంలోని 30వేల మందికి పైగా అణగారిన వర్గాలకు రూ.10లక్షల చొప్పున అందించి వారి జీవితాల్లో వెలుగులు నిం పేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నూకల నరేశ్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆంగోత్ బిందు, కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు పానుగోతు రాంలాల్, కొమ్మినేని రవీందర్, మైనార్టీ సెల్ నాయకుడు షేక్ అఫ్జల్ పాల్గొన్నారు.