న్యూశాయంపేట, జనవరి 29 : వరంగల్ నగరంలోని భద్రకాళి బండ్ పై జరుగుతున్న అభివృద్ధి పనులను
కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి నగర మేయర్ గుండు సుధారాణి గురువారం పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో పనులను తనిఖీ చేసి , పనుల పురోగతి తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ సత్యనారాయణ, ఈ మాధవిలత, డీఈ రాగి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.