గురుకుల పాఠశాలలో ఆరోగ్య శిబిరం – విద్యార్థినులకు హెల్త్ ఎడ్యుకేషన్, టీకాలు
రామవరం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (UPHC) ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తగూడెం కార్పొరేషన్ పరిధి నాగయ్యగడ్డలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల (TGTWURJC)లో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కె.అనురాధ పాల్గొన్నారు.
రుద్రంపూర్, జూలై 31 : రామవరం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (UPHC) ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తగూడెం కార్పొరేషన్ పరిధి నాగయ్యగడ్డలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల (TGTWURJC)లో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కె.అనురాధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత, హ్యాండ్వాష్ టెక్నిక్స్, వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫ్రైడే డ్రైడే కార్యక్రమం ప్రాముఖ్యతపై వివరించారు. అలాగే ప్రతిరోజూ గోరువెచ్చని నీరు తాగడం వల్ల ఆరోగ్యం మెరుగు పడుతుందన్నారు. అనంతరం విద్యార్థినులకు హెచ్పీవీ వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించి, అర్హులైన వారికి టీకాలు అందించారు. అలాగే 10 నుండి 16 సంవత్సరాల విద్యార్థినులకు టీడీ (TD) వ్యాక్సిన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల స్టాఫ్ నర్స్ జి.రమ్య, ఏఎన్ఎంలు బి.తార, పి.శ్రీలక్ష్మి, కె.రాజేశ్వరి, ఆశా కార్యకర్త టి.రాజమణి పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

