Hundis Thief | ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతూ హుండీలను తస్కరిస్తున్న వ్యక్తిని పోలీసులు సోమవారం ఉదయం పట్టుకున్నారు. ఈనెల 2వ తేదీన మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో గుణపంతో తలుపు తాళాలు పగలగొట్టి గర్భగుడిలో ఉన్న హుండీని ఎత్తుకుపోవడమే కాకుండా ఈ నెల 11వ తేదీన రామన్నగూడెంలోని శివాలయంలో కూడా తలుపు తాళాలు పగులగొట్టి హుండీ ఎత్తుకుపోయి చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు సోమవారం ఉదయం అరెస్టు చేసి రిమాండ్ పంపించారు.
ఎస్ఐ రాజకుమార్ ఈ మేరకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు. సోమవారం ఉదయం ఏటూరు నాగారం బస్టాండ్ సెంటర్లో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించి పోలీసులను చూసి పరిగెత్తుతుండగా అతని పట్టుకొని విచారించారు. ఈ క్రమంలో సాయిబాబా ఆలయంలో చోరీకి పాల్పడిన సమయంలో ఉన్న సీసీ కెమెరా రికార్డ్ అయిన వ్యక్తి.. పట్టుబడిన వ్యక్తి ఒక్కరిగానే ఉన్నట్లు గుర్తించి పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో పట్టుబడిన వ్యక్తి హుండీల దొంగగా గుర్తించారు.
పట్టుబడిన దొంగ తాడ్వాయి మండలం వీరాపూర్ గ్రామానికి చెందిన చేల సందీప్‌గా తమ విచారణలో వెల్లడైందని సీఐ పేర్కొన్నారు. పట్టుబడిన సందీప్ నుంచి రూ. 1100 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. వాహనాల తనిఖీలో ఎస్ఐ రాజకుమార్ కానిస్టేబుల్ సదానందం హరీష్ తదితరులు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.
Juluri Gourishankar | జూలూరి గౌరీశంకర్ రచించిన ‘బహుజనగణమన’ ఆవిష్కరణ
Student | అదృశ్యమైన ఆరు రోజుల తర్వాత.. యమునా నదిలో శవమై తేలిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని