Godavari river | గోదావారి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో భద్రాచలానికి రాకపోకలు నిలిచిపోయాయి.
ములుగు : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. భారీ వరదలతో జిల్లాలోని వెంకటాపురం నుగూరు – భద్రాచలానికి రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.