Mrithyunjay Movie | మర్డర్ మిస్టరీతో వస్తున్న శ్రీవిష్ణు.. రాజమౌళి చేతుల మీదుగా ‘మృత్యుంజయ్’ టీజర్ లాంచ్
Mrithyunjay Teaser | టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'మృత్యుంజయ్'.
Mrithyunjay Movie | టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’. ఈ చిత్రం ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ గ్రిప్పింగ్ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు. ఒక సస్పెన్స్‌తో కూడిన మర్డర్ కేసును ఛేదించే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా శ్రీవిష్ణు ఈ చిత్రంలో కనిపించనుండగా, అందరూ ప్రమాదంగా భావించే ఒక ఘటన వెనుక ఉన్న నిజాన్ని హీరో ఎలా వెలికితీశారనే ఉత్కంఠభరితమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.
సుకుమార్ శిష్యుడు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో, శ్రీవిష్ణు సరసన ‘సామజవరగమన’ ఫేమ్ రెబా మోనికా జాన్ హీరోయిన్గా నటిస్తోంది. కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవగా, లైట్ బాక్స్ మీడియా మరియు పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 27, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

