టేకులపల్లి, ఫిబ్రవరి 12 : టేకులపల్లి మండలం సులానగర్ గ్రామానికి చెందిన మాజీ వైఎస్ ఎంపీపీ ఉండేటి ప్రసాద్ విగ్రహావిష్కరణలో బీఆర్ఎస్ టేకులపల్లి మండల నాయకులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రసాద్ కుమారుడు ఉండేటి చెన్నయ్య, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రసాద్ రాజకీయాలలో అందరికి సుపరిచితుడుగా ఉండేవారన్నారు. గర్వం లేని మంచి వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ మాజీ చైర్మన్, మాజీ జెడ్పిటిసి లక్కినేని సురేందర్రావు, జిల్లా నాయకులు భూక్య దళ్సింగ్ నాయక్, టేకులపల్లి సర్పంచ్ బోడా బాలు నాయక్, సులానగర్ సర్పంచ్ గుగులోత్ లక్ష్మా, చుక్కలబోడు సర్పంచ్ బానోత్ రామానాయక్, బీఆర్ఎస్ మండల నాయకులు కిరణ్, బాలకృష్ణ, పూల్సింగ్, రమేష్, రాంకుమార్ పాల్గొన్నారు.