BRS Belgium | బెల్జియంలో బీఆర్ఎస్ శాఖను ప్రారంభించిన గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల
BRS Belgium | భారత రాష్ట్ర సమితి గ్లోబల్ విస్తరణలో మరో కీలక అడుగు పడింది. బెల్జియం లో బీఆర్ఎస్ 54వ శాఖను బీఆర్ఎస్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల ప్రారంభించారు.
బెల్జియం: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గ్లోబల్ విస్తరణలో మరో కీలక అడుగు పడింది. బెల్జియం ( BRS Belgium ) లో బీఆర్ఎస్ 54వ శాఖను బీఆర్ఎస్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల ( Mahesh Bigala ) ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) 50వ జన్మదిన వేడుకలను బెల్జియంలోని పార్టీ అభిమానులు, తెలంగాణ ప్రవాసులు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ అభివృద్ధికి, యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న కేటీఆర్ నాయకత్వాన్ని కొనియాడుతూ సభ్యులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మహేష్ బిగాల మాట్లాడుతూ బెల్జియం బీఆర్ఎస్ శాఖను బలోపేతం చేసేందుకు తాత్కాలిక అడహాక్ కమిటీని జగన్నాథ్ ప్రసాద్ రామానుజం నాయకత్వంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తి అయిన అనంతరం పూర్తి స్థాయి కార్యవర్గాన్ని అధికారికంగా ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సహాయం చేసిన ప్రవీణ్ జారుగుమల్లికి , బెల్జియంలో బీఆర్ఎస్ శాఖ ఏర్పాటుకు విశేష కృషి చేసిన శ్యామ్ అకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, మనోజ్, మంజునాథ్, విజయ్, రాజశేఖర్, ఫణి, హరీష్, నాగరాజు జగిని, శ్రీకాంత్, అఖిల్ రెడ్డి, భాను, చన్నా రెడ్డి, రమణ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

