ములుగు : జిల్లాలోని మంగపేట మండలం నరసింహ సాగర్ గ్రామ పరిధి శనగ కుంట ప్రాంతంలో గురువారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాద సంఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య సందర్శించారు.
బాధితుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
బాధితులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలిక వసతులు ఏర్పాటు చేసి తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా, శనగ కుంటలో గురువారం సాయంత్రం వచ్చిన ఈదురుగాలులతో పొలాల్లోని ఎరగడి మంటలు అంటుకొని అగ్ని ప్రమాదం సంభవించడంతో సుమారు 40 ఇళ్లు దగ్ధమయ్యాయి.