మహబూబాద్ : ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఒక చరిత్ర ఉందని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. శుక్రవారం పట్టణ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూనియర్ కళాశాలలో నిర్మిస్తున్న నూతన గదుల నిర్మాణం విద్యార్థులకు ఉపయోగపడే విధంగా నిర్మించాలన్నారు.
విద్యార్థులకు అన్ని రకాల వసతులను కల్పించే విధంగా ఇంజినీరింగ్ అధికారులు చూసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో జూనియర్ కళాశాలలో చేరే విధంగా కళాశాల అధ్యాపకులు ప్రత్యేక కృషి చేయాలని, విద్యార్థులకు కళాశాలను నాణ్యమైన విద్యను అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలోఎంకన్న రాజు, ఎడ్ల వేణు, తదితరులు పాల్గొన్నారు.