హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 24 : క్రీడల్లో కాక వెంకటస్వామి కుటుంబంలోని మూడు తరాలు సేవ చేయడమే కాకుండా రాబోయే తరాలకి ఆదర్శంగా నిలుస్తుందని కాక వెంకటస్వామి కుటుంబానికి క్రీడల పట్ల ఉన్న అంకిత భావాన్ని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధే ధ్యేయంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాకా వెంకట స్వామి మెమోరియల్ అంతర్ జిల్లాల టీ-20 క్రికెట్ పోటీలను వంగాలపెల్లిలోని వరంగల్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ మైదానంలో అట్టహాస్టంగా జరిగాయి.
ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ బస్వరాజు పాల్గొని పోటీలను ప్రారంభించారు. అనంతరం సారయ్య మాట్లాడుతూ ఇంతమంచి అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగపరుచుకొని జాతీయస్థాయి ఎదగాలి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గుండెటి రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గోరంట్ల రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు సదాశివ, సంయుక్త కార్యదర్శి బస్వరాజు ఉపేందర్, కార్యవర్గ సభ్యులు అభినవవినయ్, శంకర్ పాల్గొన్నారు.
మ్యాచ్ వివరాలు
వరంగల్ జట్టు మహబూబాబాద్ జట్టుపై గెలుపొందగా వరంగల్ జట్టులో రీష్యాంత్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు. వరంగల్‌లోని మొగిలిచర్ల గ్రౌండ్లో జరిగిన మ్యాచ్‌లో హనుమకొండ జట్టు భూపాలపల్లి జట్టుపై గెలుపొందగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా త్రిశూల్ ఎంపికయ్యాడు. ములుగులోని జాకరం గ్రౌండ్లో జరిగిన మరో మ్యాచ్ జనగామ, ములుగు తలపడగా ములుగు విజయం సాధించింది, ములుగు జట్టులో సిద్దార్థ్ నాయక్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికైనట్లు వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు.