రెండో సారి గెలుపు ఖాయం
నర్సంపేటలో రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని, 51వేల మెజార్టీ సాధిస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అయిదేళ్ల కాలంలో తాను చేసిన అభివృద్ధిని చూసిన ప్రజల ఆదరణ బాగుందన్నారు.
- 51వేల మెజార్టీతో విజయం సాధిస్తా
- కాంగ్రెస్ అభ్యర్థిది నేర చరిత్ర
- ఆయన జైలులో ఉన్నది మరిచారా?
- ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
నర్సంపేట, నవంబర్ 28 : నర్సంపేటలో రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని, 51వేల మెజార్టీ సాధిస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అయిదేళ్ల కాలంలో తాను చేసిన అభివృద్ధిని చూసిన ప్రజల ఆదరణ బాగుందన్నారు. బోనాలు, బతుకమ్మలతో గ్రామాలు, తండాల్లో పెద్ద ఎత్తున అపూర్వ స్వాగతం పలికారన్నారు. 2018లో 16,700 మెజార్టీతో గెలిచానని, ఇప్పుడు అంతకంటే రెట్టింపు స్థాయి మెజార్టీ వస్తుందని నమ్మకం ఉందన్నారు. నర్సంపేట ఎమ్మెల్యేగా తక్కువ కాలంలో ఎక్కువ నిధులు తెచ్చి అభివృద్ధి చేశానని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డితో పాటు మరొకరు హత్యలు చేసి జైలు పాలైన విషయం మరిచారా? అని ప్రశ్నించారు. తనపై ఒకసారి మాట్లాడితే వీరిపై వందసార్లు మాట్లాడాల్సి వస్తుందని అన్నారు.
నర్సంపేటలో రౌడీయిజం, గూండాయిజం లాంటి పనులు చేస్తామంటే కుదరదని చెప్పారు. ప్రజలు ప్రతిపక్ష నాయకుల తీరుతో విసిగిపోయారన్నారు. ప్రజలు శాంతియుతంగా ఉండేందుకు కోరుకుంటున్నారని, అలాంటి వారే తనలాంటి వారికి అవకాశం ఇచ్చారని తెలిపారు. నిధులు తెస్తే కాంగ్రెస్ నాయకులు కోర్టులకు వెళ్లి స్టేలు తీసుకు వస్తున్నారని, పనులకు అడ్డుపడుతున్నారని చెప్పారు. తాను పంట నష్టపరిహారం తెస్తే దిష్టిబొమ్మలను దహనం చేయించారని, ఆయన అధికార పక్షంలో ఉన్నప్పుడు నర్సంపేటను ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా రెండో సారి గెలిస్తే రింగురోడ్డు నిర్మిస్తానని తెలిపారు. పాకాల లైనింగ్ కాల్వల నిర్మాణం కూడా చేపడుతానన్నారు.అభివృద్ధి పనులు కొనసాగాలంటే తాను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిస్తేనే సాధ్యమవుతుందని తెలిపారు. ఎన్నికల్లో తప్పకుండా తన కారుగుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

