జనగామ : తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా ముందుకొచ్చిన కేసీఆర్ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉజ్వల చరిత్ర కలిగిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ 2001ఏప్రిల్ 27న పురుడు పోసుకుందన్నారు. కేసీఆర్ నాడు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్య త్వానికి, డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసాడు. గులాబీ జెండాను ఎగరావేసి అత్యంత తక్కువ సమయంలోనే 90జడ్పీటీసీలు గెలిపించుకున్నారని గుర్తు చేశారు.
అనేక పార్టీల జెండా ఏదయినా అజెండా ఒక్కటే అని అన్ని పార్టీలను ఏకతాటి పై తీసుకోచ్చారన్నారు. దేశంలో 34పార్టీల నుంచి మద్దతును సంపాదించి పార్లమెంట్లో తనచాణిక్యతను ప్రదర్శించి 2014లో తెలంగాణను సాధించారని పేర్కొన్నారు. పోరాడి సాధించిన తెలంగాణను దేశం గర్వించేలా 24గంటల కరెంటు, కోటి ఎకరాలకు సాగునిరు, రైతుబీమా, రైతులకు రుణమాఫీ చేసి నెంబర్ వన్‌గా నిలిపారాని ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 16నెలలు గడుస్తున్నా ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. చేతగాని ప్రభుత్వం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుంటుపడిందని మండిపడ్డారు.