జనగామ, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : అత్యధిక పాల ఉత్పత్తి జరి గే జనగామ ప్రాంత పాడి రైతుల సమస్యలను పరిష్కరించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. అసెంబ్లీ వేదికగా ఇప్పటికే తాను పాడి రైతుల సమస్యలను లెవనెత్తానని గుర్తు చేశారు. మంగళవారం జనగామలోని విజయ డెయిరీ కేం ద్రంలో పాడి రైతుల సర్వసభ్య సమావేశం నిర్వహించగా డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి హాజరయ్యారు.
అసెంబ్లీలో మాట్లాడే మొదటి అవకాశం వచ్చినప్పుడు తాను జనగామ ప్రాంత పాల రైతుల సమస్యలపై మాట్లాడానని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి వివరించారు. పాల ఉత్పత్తిదారులకు పెండిం గ్ బిల్లుల చెల్లింపు వంటి అంశాలను పరిష్కరించాలని కోరానన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో సాగు నీటి సమస్య లేదని, కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలోనే నీటి కొరత ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. రైతు సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, పాల ఉత్పత్తిదారుల సం క్షేమం కోసం తాను ఎల్లప్పుడూ ముందుంటానని పల్లా హామీ ఇచ్చారు.