న్యూశాయంపేట, డిసెంబర్ 6 : గ్రేటర్ వరంగల్ పరిధి 31 వ డివిజన్ శ్రీరామ గాయత్రి కాలనీలో సీసీ రోడ్డు పనులకు శనివారం స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కార్పొరేటర్ మామిండ్ల రాజు తో కలిసి శంకుస్థాపన చేశారు. రూ.40 లక్షలతో రోడ్డు, డ్రైన్ పనులు పనులను ప్రారంభించినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు గుముడవెల్లి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కర్ర నారాయణరెడ్డి, ముఖ్య సలహాదారులు కరిమిండ్ల లింగారావు, దుగ్యాల రవీందర్రావు, సాయిని ప్రసాద్, గుండా సంతోష్, సంకినేని ధర్మారావు,మిట్ట పెల్లి వేణుగోపాల్ రావు, నెల్లుట్ల నరసింహారావు, రాముల విష్ణు, భూక్య ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు