హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 15: అక్టోబర్ 16 నుంచి 18 వరకు హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో జరిగే 5వ ఓపెన్ అండర్ 23వ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలకు ముఖ్యఅతిథులుగా హాజరుకావాలని సీఎం రేవంత్‌రెడ్డి పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు హైదరాబాద్ తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎంను కలిసి అథ్లెటిక్స్ పోటీల పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనరెడ్డి, రాష్ర్ట అథ్లెటిక్స్ ఛైర్మన్ ఎర్రబెల్లి వరద రాజేశ్వర్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మహమ్మద్ అజీజ్‌ఖాన్, జిల్లా క్రీడాశాఖ అధికారి గుగులోతు అశోక్‌కుమార్ నాయక్, ప్రధాన కార్యదర్శి సారంగపాణి ఉన్నారు.