ఖిలావరంగల్, నవంబర్ 24: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ కోరారు. వరంగల్ 38వ డివిజన్ ఖిలావరంగల్‌లో శుక్రవారం కార్పొరేటర్ బైరబోయిన ఉమ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు మద్దతుగా మహిళలు బతుకమ్మ, బోనాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నరేందర్ మాట్లాడుతూ చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు కోటను సమగ్రంగా అభివృద్ధి చేశానన్నారు. తెలంగాణ రాక ముందు అసమర్థులు పాలించడం వల్ల కోట అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ దిశగా సాగుతున్న తరుణంలో కొన్ని విచ్ఛిన్నకర శక్తులు అభివృద్ధికి అడ్డుపడి ప్రజలను గోస పెట్టాలని చూస్తున్నాయని ఎద్దేవా చేశారు. ప్రచారానికి వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకులను తరిమికొట్టాలని ప్రజలను కోరారు.
వరంగల్ తూర్పులో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు డిపాజిట్ల కోసం కొట్లాడుతున్నాయని ఎద్దేవా చేశారు. పూటకో మాట మార్చే బీజేపీ నాయకుడు.. రేపు ప్రజలను వదిలి ఎక్కడి పోతాడో తెలియని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్‌యాదవ్, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, బీఆర్ఎస్ నాయకులు రాజనాల శ్రీహరి, తోట హరీష్, ఇనుముల మల్లేశం, దిద్దిగల సోమేశ్వర్, సులుగం గోపాల్, మిట్టపెల్లి వెంకటేశ్వర్లు, కొప్పుల క్రాంతి, బొల్లం కార్తీక్, సులుగం అశోక్, రావుల రాజేశ్, పోశాల రాజేశ్, పోశాల రాజు, గాదె మధు, తోటకూరి చేరాలు, మధు, రవి, దర్శన్, పెద్దోజు సాయి, కట్టమల్లు, అనుమాసు సత్యం పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్: వరంగల్ దేశాయిపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రచారం చేశారు. వాడవాడలా కారు గుర్తుకు ఓటు వేయాలనే నినాదాలు మార్మోగాయి. దేశాయిపేటలో యాదవులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కార్పొరేటర్ కావటి కవితా రాజుయాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ప్రజలు పెద్ద ఎత్తున కదలివచ్చి బతుకమ్మలు, బోనాలతో ఘన స్వాగతం పలికారు. యాదవులు ఎమ్మెల్యేకు గొంగడి కప్పి, గొర్రెపిల్లను అందించారు. గత పాలకులు దేశాయిపేటను గాలికొదిలేస్తే తాను భుజాన వేసుకుని ఎంతో అభివృద్ధి చేశానని నన్నపునేని అన్నారు. ఈ ప్రాంతంలోని అన్ని కులాలకు కమ్యూనిటీ హాళ్లు నిర్మించామని తెలిపారు. రజకులు, ముదిరాజ్ కులస్తులు నిర్మించుకున్న ఆలయాలకు తాను వ్యక్తిగతంగా సహాయ సహకారాలు అందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో హస్తకళల చైర్మన్ బొల్లం సంపత్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే దోనెపూడి రమేశ్‌బాబు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ డాక్టర్ పోలా నటరాజ్, పార్టీ నాయకుడు రాజనాల శ్రీహరి, కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి, బస్వరాజు కుమారస్వామి, సురేశ్‌జోషి, ఎండీ ఫుర్ఖాన్, డివిజన్ ఎన్నికల ఇన్చార్జి యెలుగం శ్రీనివాస్, అధ్యక్షుడు సోల రాజు, రాంఖీయాదవ్, రాజు పటేల్, నట్ట నారాయణ, పొగాకు సదానందం, అంకతి రవి, సాయిరెడ్డి, మల్లారెడ్డి పాల్గొన్నారు.
గిర్మాజీపేట: మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కారు పెద్దపీట వేసిందని, మైనార్టీల అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్ అన్నారు. మండిబజార్‌లోని వివిధ ప్రార్థనా మందిరాలకు వెళ్లి ముస్లింలను కలిశారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనకు మరో అవకాశం కల్పించాలని కోరారు. బీఆర్ఎస్ నేత మసూద్, మైనార్టీ నేత మస్తాన్ పాల్గొన్నారు.