బచ్చన్నపేట నవంబర్ 3 : వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామంలో గద్ద కుమారస్వామి అనే రైతుకు సంబంధించిన పంట పొలాన్ని మహేశ్వర్ రెడ్డి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు పండించినటువంటి పంట చేతికి వచ్చిన తర్వాత మొంథా తూఫాన్ కి పూర్తిగా నేలమట్టం అయిందన్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని ప్రభుత్వం ఒకవైపు చెపుతా ఉంటే, 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని రైతు సంఘాలు చెబుతున్నాయన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని ఎకరాల పంట నష్టం జరిగింది, నష్ట పరిహారం ఎప్పటిలోగా ఇస్తారో ప్రభుత్వం ఇంకా ప్రకటన చేయకపోవడం సిగ్గుచేటన్నారు.
కేవలం నష్టపరిహారం ఇస్తామని పేపర్ ప్రకటనలు తప్ప ఇంతవరకు రైతులకు నష్టపరిహారం చెల్లించకపోవడం చాలా బాధాకరం అన్నారు. ఈ కార్యక్రమంలో చౌడ రమేష్, కిసాన్ మోర్చ రాష్ర్ట అధ్యక్షుడు బస్వ లక్షినర్సయ్య, రాష్ట్ర కిసాన్ మోర్చ ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి, బిజెపి మండల అధ్యక్షులు బంగారు మహేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ఉమారాణి, ఉడుగుల రమేష్, బల్ల శ్రీనివాస్, బేజడి బీరప్ప, మండల ప్రధాన కార్యదర్శి గద్ద రాజు, జిల్లా నాయకులు సద్ది సోమిరెడ్డి, చిమ్ముల నరేందర్ రెడ్డి, కురెళ్ళ వెంక్కన్న, శశధర్ రెడ్డి, పెండం నాగేష్, చక్రపాణి, రమేష్, వెంకటేష్, రాంబాబు, సాంబయ్య పాల్గొన్నారు.