హనుమకొండ(ఐనవోలు): ఓ వృద్ధురాలకి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆశ్రయం కల్పించి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రంలోని ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయం ఆవరణంలో కుటుంబ సభ్యుల మీద ఇష్టం లేక ఓ వృద్ధురాలు గత 15 రోజులుగా ఉంటూ ఇబ్బందులను ఎదుర్కుంటుంది. ఈ మేరకు గ్రామస్తులు ఎమ్మెల్యేకు సమాచారం అందించడంతో వెంటనే స్పందించారు. వృద్ధురాలి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా సదరు వృద్ధురాలు నిరాకరించింది. దీంతో సహృదయం ఆనాథాశ్రమం నిర్వహకులు మహ్మద్ యాకుబ్‌ను పిలిపించి వారికి వృద్ధురాలుని అప్పగించారు.
వృద్ధురాలికి ఎలంటి లోటు రాకుండా చూసుకోవాలని సూచించారు. ఈ మేరకు వృద్ధురాలు, గ్రామస్తులు ఎమ్మెల్యే నాగరాజుకు ప్రత్యేక కృతజ్ణతలు తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సమ్మెట మహేష్, జిల్లా నాయకులు జన్నపురెడ్డి రుగ్వేదొడ్డి, మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కత్తి సుధీర్, గ్రామపార్టీ అధ్యక్షుడు భాస్కర్, మండల అధికార ప్రతినిధి కొత్తూరి సునీల్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు రహీమ్ పాషా, నాయకులు చింత అశోక్, మాజీ సర్పంచ్ కుమారస్వామి, రవీందర్, పరమేశ్ తదితరులు ఉన్నారు.