వేలేరు : ప్రభుత్వ నిబంధనల మేరకు మాత్రమే లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలని, నాలుగు రూములుగా, పెద్దగా కట్టుకుంటే మాత్రం బిల్లులు రావని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లా వేలేరు మండలం శాలపల్లి (పైలట్) గ్రామంలో మంగళవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఇండ్ల నిర్మాణాన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం సుమారు 400 చదరపు అడుగుల నుండి 550 చదరపు అడుగుల వరకే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. అంతకు మించి పెద్దగా కట్టుకుంటే బిల్లులు రావని ఎమ్మెల్యే కడియం శ్రీహరి హెచ్చరించారు.