MLA Kadiyam Srihari | జీవో 97ను రద్దు చేయాలి : ఎమ్మెల్యే కడియం శ్రీహరి
MLA kadiyam srihari | పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యను పరిష్కరించేందుకు ఒక కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ వీటన్నింటిని కూడా అధ్యయనం చేస్తున్నది.. నేను ఆ కమిటీకి సూచించేది ఒకటే. పాలిటెక్నిక్ విద్యార్థులను టెక్నికల్ ఎడ్యుకేషన్‌లోనే కొనసాగించాలని ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
MLA Kadiyam Srihari | జీవో 97 రద్దు చేయాలని ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కడియం శ్రీహరి మాట్లాడుతూ.. మాజీ విద్యాశాఖ మంత్రిగా జీవో 97ను రద్దు చేయాలి. పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్‌ను ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్‌తో కలిపే ఉంచాలని డిమాండ్ చేస్తున్నానన్నారు.
పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్‌ను లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ కిందకు తీసుకురావొద్దు.. తద్వారా విద్యార్థులకు లేని అపోహలు ఏర్పడుతున్నాయి. మేం ఇంజినీరింగ్ చదువుకున్నాం.. లేబర్ డిపార్ట్మెంట్కు పోతమా..? అనే లేని అపోహ వాళ్ల మనసులోకి వచ్చింది. స్కిల్ యూనివర్సిటీకి దీన్ని అనుసంధానం చేసి పాలిటెక్నిక్ విద్యతోపాటు కొన్ని స్కిల్స్ నేర్పిస్తే వాళ్లకు వెంటనే ఉద్యోగాలొస్తయని ఆలోచన ప్రభుత్వం చేసి.. కానీ విద్యార్థులంతా కూడా మేం లేబర్ డిపార్ట్మెంట్లోకి వెళ్లం. రేపు పాలిటెక్నిక్ అయిపోతే ఇంజినీరింగ్ పోవాల్సినోళ్లం.. వైట్ కాలర్ జాబ్ చేయాల్సినవాళ్లమే తప్ప మేం కిందికి పోమనే ఆలోచనలో ఉన్నరు.. వాళ్లు కూడా కరెక్టే.. కాబట్టి నేను ప్రభుత్వాన్నికోరుతున్నానన్నారు.
పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యను పరిష్కరించేందుకు ఒక కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ వీటన్నింటిని కూడా అధ్యయనం చేస్తున్నది.. నేను ఆ కమిటీకి సూచించేది ఒకటే. పాలిటెక్నిక్ విద్యార్థులను టెక్నికల్ ఎడ్యుకేషన్‌లోనే కొనసాగించాలి. పాలిటెక్నిక్ పూర్తయిన తర్వాత ఇంజనీరింగ్ వెళ్లడానికి లేటరర్ ఎంట్రీని కూడా ఉంచండి. వాళ్లను దేశవ్యాప్తంగా పాలిటెక్నిక్స్ ఎలా ఉన్నాయో అవన్నీ ఏఐసీటీఈ కింద ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా అదే పద్దతి కొనసాగితే బాగుంటుంది. ఆ విద్యార్థులు ఒక రకమైన అపోహలో, భయాందోళనలో ఉన్నారు. వాళ్ల అపోహలను నివృత్తి చేయాల్సిన అవసరముందన్నారు.
జీవో 97 రద్దు చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి
మాజీ విద్యాశాఖ మంత్రిగా జీవో 97ను రద్దు చేసి, పాలిటెక్నిక్‌ను ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్‌తో కలిపే ఉంచాలని డిమాండ్ చేస్తున్నాను
ఈ జీవోతో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నందున,… pic.twitter.com/6gM5Uy2cxe
— Telugu Scribe (@TeluguScribe) August 29, 2026
Read Also :
సెప్టెంబర్ 1న ఉమ్మడి నల్లగొండ జిల్లా జూనియర్ బాలికల ఫుట్‌బాల్ జట్టు ఎంపికలు
Suryapet News | వేపచెట్టు వివాదం.. రెండు నిండు ప్రాణాలు బలి.. ఎస్ఐకి గాయాలు!
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

