నల్లబెల్లి, జూన్ 16 : నిరుపేదలకు ఉండేందుకు నీడ కల్పించడమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. మండలంలోని నల్లబెల్లి, లెంకాలపల్లి, రుద్రగూడెం, రంగాపురం, గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసి ముగ్గులు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట తప్పని మడమ తిప్పని కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ మంజూరి చేస్తామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నిరుపేద వర్గాలకు కూడు, నీడ కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి తోపాటు ముఖ్య నాయకులు లబ్ధిదారులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.