గీసుగొండ, ఆగస్టు 5: అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ర్టానిదే అగ్రస్థానమని పరకాల ఎమ్మె ల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని బొడ్డుచింతలపల్లి గ్రామంలో పంట నష్టపోయిన 398 మంది రైతులకు నష్ట పరిహారం చెక్కులను అందజేశారు. ఈ సందర్భం గా సర్పంచ్ కేదాసి అనిల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. పోరాడి సాదించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందన్నారు. తెలంగాణ ఏర్పడితే కరెంటు లేక అంధకారమవుతుందని చెప్పిన నాయకులు రాష్ట్రంలో 24 గంటల కరెంటును చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల కరెంటుతో పాటు రైతు బంధు, రైతుబీమా ఇస్తున్నారన్నారు. రాష్ర్టాన్ని 70 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ప్రభు త్వం ఒక్కనాడు కూడా రైతుల కోసం ఆలోచించలేదన్నారు. 3 గంటల కరెం టు చాలు అంటున్న కాంగ్రెస్ పార్టీ కావాలా? మూడు పంటల పండించేలా కరెంటు ఇస్తున్న బీఆర్ఎస్ పార్టీ కావా లో రైతులు ఆలోచించాలని కోరారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తున్న సీఎం కేసీఆర్‌కు అండగా ఉండాలని కోరారు. దేశానికే తెలంగాణ రోల్ మోడల్‌గా నిలుస్తుందన్నారు. పరకాలను అభివృద్ధి చేసిన తనను ఎన్నికల్లో ఆశీర్వదించి, గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, ఎంపీపీ భీమగాని సౌజన్య, తహసీల్దార్ రీయాజుద్దీన్, ఎంపీడీవో వీరేశం, ఏవో హరిప్రసాద్‌బాబు, 15వ డివిజన్ కార్పొరేటర్ మనోహర్, రైతు బందు సమితి మండల కన్వీనర్ వీరాటి లింగారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ దొంగల రమేశ్, మార్కె ట్ కమిటీ డైరెక్టర్ గోలిరాజయ్య, పార్టీ మండల అధ్యక్షుడు వీరగోని రాజ్‌కుమార్, కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి, నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు ప్రకాశ్‌రావు, బుర్జం రమేశ్, సర్పంచ్‌లు నాగేశ్వర్రావు, ప్రకాశ్, జైపాల్‌రెడ్డి, దౌడు బాబు, గీసుగొండ సొసైటీ చైర్మన్ రడం శ్రీధర్, నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో పలువురి చేరిక
ఆత్మకూరు : నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, యువకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని తన నివాసంలో జిల్లా నాయకుడు జిన్నా రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్లో చేరగా ఎమ్మెల్యే వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే చల్లా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో పని చేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందన్నా రు. రాష్ట్రంలో ప్రతి పేదవాడి గుండెల్లో సీఎం కేసీఆర్ ఉంటారన్నారు. పార్టీలో చేరిన వారిలో వైఎస్సార్టీపీ నుంచి గురిజాల అఖిల్, కాంగ్రెస్ నుంచి గుండెబోయిన రాజు, గుండెబోయిన సారయ్య, ఈర్ల పైడి, ఈర్ల రాజు, బయ్య సాంబయ్య, బీజేపీ నుంచి నర్ర సాంబయ్య, మోటం పైడి, వడ్డెపల్లి రాజు, ఈర్ల చంద్రమోహన్, ఈగ గోపాల్, పాండవుల కిరణ్, కుంటమల్ల రాజేందర్‌తోపాటు మరో 25 మంది యువకులు ఉన్నారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి కోఆర్డినేటర్ ఎనకతాళ్ల రవీందర్, నాయకులు జన్నారపు రాయుడు తదితరులు పాల్గొన్నారు.