గార్ల, అక్టోబర్ 26 : బీఆర్ఎస్ పార్టీ అన్నింటా ముందే ఉందని ఇ ల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనతోపాటు ప్రచారంలో దూసుకెళ్తున్నదని, విపక్షాలకు ఇప్పటి వరకు అభ్యర్థులే కరువయ్యారని అన్నారు. గురువారం ఆమె గార్ల మండలంలోని బాలాజీతండా, శేరిపురం, పినిరెడ్డిగూడెం, గోపాలపురం, చిన్నబంజర గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో కలి సి ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ…అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపిన సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమన్నారు. రైతులకు మూడు గంట లు కరెంట్ చాలని పిచ్చికూతలు కూసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ప్రజలు అభివృద్ధికే మద్దతుగా నిలుస్తారని అన్నారు. గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకులను ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల తర్వాత ఆ పార్టీలు అడ్రస్ ఉండవని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రాంపురం పాకాల ఏరుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.15 కోట్లతో శంకుస్థాపన చేశామన్నారు.
ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధికి హర్నిశలు కృషి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకే ఓటు అడిగే హక్కు ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక రైతులు అష్టకష్టాలు పడుతున్నారని, సోషల్ మీడియా ద్వారా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నట్లు వివరించారు. సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. నవంబర్ ఒకటిన ఇల్లందులో జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాదసభకు 10వేల మంది కార్యకర్తలు తరలి రావాలని కోరారు. కారు గుర్తుకు ఓటేసి భార్టీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, ఎంపీపీ మూడు శివాజీచౌహాన్, మండల అధ్యక్షుడు గంగావత్ లక్ష్మణ్‌నాయక్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రాధాకృష్ణ, బయ్యా రం మండల అధ్యక్షుడు తాతా గణేశ్, ఎంపీటీసీ శీలంశెట్టి రమేశ్, సర్పంచ్‌లు శంకర్, భద్రూనాయక్, జ్యోతి, భూక్యా భారతి, ఉషానాయక్, బీసీ సెల్ అధ్యక్షుడు తోట కొండల్రావు పాల్గొన్నారు.