హసన్‌పర్తి, జూలై 12 : కాంగ్రెస్‌కు రైతులే తగిన గుణ పాఠం చెబుతారని, వారికి క్షమాపణ చెప్పాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ఒకటో డివిజన్ అధ్యక్షుడు నరెడ్లశ్రీధర్, 66 డివిజన్ అధ్యక్షుడు పాపిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో బుధవారం హసన్‌పర్తిలోని ఎర్రగట్టుగుట్ట సర్కిల్లో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రమేశ్ హాజరై రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ఏనాడూ ఆలోచించని కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ పాలనలో రైతులకు అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలను అధికారంలోకి వస్తే అందకుండా చేస్తామని అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కరంట్షాక్ ఇస్తారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర రైతాంగానికి రేవంత్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నేడు, రేపు మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసనలు తెలిపేందుకు రైతులు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ సునీత, వైస్ ఎంపీపీ రత్నాకర్‌రెడ్డి, జడ్పీటీసీ సునీత, మండల అధ్యక్షుడు బండి రజినీకుమార్, పీఏసీఎస్ చైర్మన్లు ఉదయ్‌కుమార్‌రెడ్డి, జక్కు రమేశ్ గౌడ్, ఆత్మ చైర్మన్ చంద్రమోహన్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు పెసరు శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ సుభాశ్‌గౌడ్, జిల్లా నాయకులు పిట్టల కుమాస్వామి, చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, కార్పొరేటర్లు జక్కుల రజితావెంకటేశ్వర్లు, గుగులోతు దివ్యరాణీ రాజూనాయక్, సిరంగి సునీల్, డివిజన్ల అధ్యక్షులు అటికం రవీందర్, మనీంద్రనాథ్, యూత్ మండలాధ్యక్షుడు మేక భగవాన్‌రెడ్డి, శ్రీకాంత్, మార్కెట్ డైరెక్టర్లు వీసం సురేందర్‌రెడ్డి, రాజేశ్వర్‌రావు, గనిపాక కల్పనా విజయ్, గ్రామ అధ్యక్షులు మూల దేవేందర్, దోమల శ్రీనివాస్ మైఖేల్ రాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.