కాశీబుగ్గ, నవంబర్ 19: కారు గుర్తుకు ఓటు వేస్తేనే కావాల్సినంత అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. ఆదివారం 14వ డివిజన్లోని ఎనుమాముల, ఎస్ఆర్నగర్, బాలాజీనగర్, సుందరయ్యనగర్, ఎన్టీఆర్నగర్, కారల్‌మార్క్స్‌కాలనీ, రెడ్డిపాలెంతోపాటు పలు కాలనీల్లో ఆయన ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. స్థానిక మహిళలు బతుకమ్మలు, మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. డప్పుచప్పుళ్లు, కోలాటాలతో నృత్యాలు చేశారు. బాలాజీనగర్ జంక్షన్లో అరూరికి హైడ్రాతో గజమాల వేసి స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ 14వ డివిజన్లోని పలు కాలనీల్లో చేసిన అభివృద్ధిని చూసి కారుగుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఆదరించాలని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. ప్రజలు వాటిని నమ్మి మోసపోవద్దన్నారు. గతంలో పాలించిన తెలంగాణను అన్ని విధాలా వెనుబడేలా చేసిందన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు. ఆచరణకు సాధ్యం కానీ హామీలతో ఓట్లు దండుకోవాలని చూస్తున్న కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రాకుండా ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని కోరారు.
బాధ్యతాయుతమైన బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోతోనే ప్రజలకు పూర్తి భరోసా అని చెప్పారు. మన సమస్యలను మనమైతేనే పరిష్కరించుకోగలుగుతామని, కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్‌ను మూడోసారి సీఎం చేయాలని కోరారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే వ్యక్తినే ఆదరించి కారుగుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. రాష్ట్రంలోనే వర్ధన్నపేటను అన్ని విధాలా అభివృద్ధి చేసి పలువురికి ఆదర్శంగా నిలుస్తానని చెప్పారు. రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ ఎల్లావుల లలితాకుమార్ యాదవ్, కార్పొరేటర్ తూర్పాటి సులోచనా సారయ్య, మాజీ కార్పొరేటర్ వీర భిక్షపతి, డివిజన్ అధ్యక్షుడు ముడుసు నరసింహా, నాయకులు కేతిరి రాజశేఖర్, పత్రి సుభాష్, గంధం గోవింద్, పత్రి రాజపోషాలు, పస్తం నర్సింగం, యాదగిరి, తూర్పాటి సంపత్, పత్రి గండ్రాతి భాస్కర్, జంగం రాజు, పసులాది మల్లయ్య, మచ్చర్ల స్టాలిన్, పెనుకుల సాంబయ్య, బండ్ల సురేందర్, ఈర్ల రాజేందర్, పిట్ట నగేశ్, కొత్తపెల్లి యాదగిరి, నాగరాజు, భూక్య శంకర్‌నాయక్, మోత్కురి రాజమౌళి పాల్గొన్నారు.