10న మంత్రి ఎర్రబెల్లి రెండోసెట్ నామినేషన్
బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈ నెల 10వ తేదీన రెండోసెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
- హాజరుకానున్న మంత్రులు హరీశ్‌రావు, సత్యవతిరాథోడ్
- పాలకుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహణ
పాలకుర్తి రూరల్, నవంబర్ 7: బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈ నెల 10వ తేదీన రెండోసెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలు సందర్భంగా పాలకుర్తిలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ముఖ్యఅతిథులుగా మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, సత్యవతిరాథోడ్ హాజరుకానున్నారు. స్థానిక బస్టాండ్ సమీపంలో బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో సభా స్థలిని మంత్రి ఎర్రబెల్లి మంగళవారం పరిశీలించారు. సభ ఏర్పాట్లపై బీఆర్ఎస్ నాయకులకు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ సందర్భంగా నిర్వహించే సభకు రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్, శాసనమండలిలో డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, బీఆర్ఎస్ స్టేషన్‌ఘన్‌పూర్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఆరోగ్యశ్రీ ట్రస్టు చైర్మన్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ సుధాకర్‌రావు హాజరవుతారని చెప్పారు. నామినేషన్ సందర్భంగా నిర్వహించే సభకు నియోజకవర్గం నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతారన్నారు. ఈ కార్య ఎంపీపీ నల్లానాగిరెడ్డి, జెడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు ఎర్రబెల్లి రాఘవరావు, ముస్కు రాంబాబు ఉన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
TG-SAFE | ఇవి తింటే రోగాలే..! టీజీసేఫ్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
Kaleshwaram Project | రిపేరెందుకు చేయలే.. మేడిగడ్డ బరాజ్‌పై కేంద్ర సాంకేతిక కమిటీ సూటి ప్రశ్నలు.. నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

