మల్హర్,మే,12 తాడిచర్ల ప్రాథమిక ఆరోగ్యం కేంద్రానికి టీజీ జెన్కో ఆధ్వర్యంలో బోగ్గు వెలికితిత పసులు చేపడుతున్నా ఏఎమ్మార్ కంపెని సీఎస్ఆర్ నిధులతో సుమరు రూ.2లక్షల విలువ చేసే వైద్య పరికరాలను సోమవారం అందించారు. ఏఎమ్మార్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి ఆదేశానుసారల ఏఎమ్మార్ కంపెనీలో పనిచేస్తున్న జనరల్ ఫిజీషియన్ డాక్టర్ శ్రీకాంత్ తాడిచర్ల ప్రభుత్వ దవాఖాన వైద్యాధికారి వినయ్ భాస్కర్ కు ఈ పరికరాలను అందించారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దీనిలో ఈసీజీ మిషన్, ఫ్రిడ్జ్, నెబైజర్, కంప్యూటర్, ప్రింటర్, వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సి.బి పి కెమికల్స్, ఎక్స్రే ఫిలిమ్స్, ఎక్స్రే కెమికల్స్ అందించారు. ఈ కార్యకమంలో హెచ్ఆర్ డీజీఎం రమేష్ బాబు, హెచ్ఆర్ అడ్మిన్ ప్రశాంత్, సీఎస్ఆర్ సూపర్ వైజర్ బొబ్బిలి నరేష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.