తాడ్వాయి, ఫిబ్రవరి 13 : మేడారం మహా జాతరలో ముఖ్య భూమిక పోషించే ట్రస్ట్‌బోర్డు కమిటీ రేపు కొలువుదీరనుంది. ఇప్పటికే చైర్మన్‌తో పాటు 13 మందిని డైరెక్టర్లుగా మంత్రి సీతక్క ఖరారు చేయగా దేవాదాయశాఖ అధికారులు ఆమోదం తెలిపారు. దీంతో గురువారం చైర్మన్, డైరెక్టర్లు సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణంలో ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్యక్రమానికి దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ సీతక్క ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. వీరి సమక్షంలో చైర్మన్‌గా అర్రెం లచ్చుపటేల్, డైరెక్టర్లుగా 12మంది సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈమేరకు దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.