తాడ్వాయి, నవంబర్ 9 : మేడారం మహాజాత ర అభివృద్ధి పనుల కమీషన్ల వాటాలు తేలకపోవ డం వల్లే ఇంకా మొదలు పెట్టడం లేదని ములుగు బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి ఆరోపించారు. మొదటగా అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. మహాజాతరకు ఇంకా 70 రోజుల సమయం మాత్రమే ఉన్నప్పటికీ ఎలాంటి పురోగతి లేదని, శాశ్వత ప్రాతిపదికన కాకుండా హడావుడిగా పనులు చేయించి కాంట్రాక్టర్ల జేబు లు నింపేందుకు సర్కారు సిద్ధమైందని ఆరోపించారు. మహా జాతరకు రూ. వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి రూ. 117 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నద ని, ఇప్పటికీ పనులు ప్రారంభించకపోవడంపై ఆమె ఆగ్ర హం వ్యక్తం చేశారు.
మేడారంలో అభివృద్ధి పేరుతో చిరు వ్యాపారుల ను రోడ్డున పడేస్తున్నారని, రోడ్ల వెంట ఉన్న వంద ల చెట్లను తొలగించి భక్తులకు నిలువ నీడ లేకుం డా చేస్తున్నారని, ప్రకృతి దేవతలు కనిపెడుతున్నారని, శిక్ష తప్పదని హెచ్చరించారు. ప్రస్తుతం జాతర పరిసరాల్లో ఉన్న మరుగుదొడ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లను వినియోగంలోకి తీసుకురాకుండా గద్దెల వెనకాల ఉన్న రైతుల భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని, వ్యవసాయాన్నే నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీ రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఆమె వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లయ్య, మాజీ సర్పంచ్‌లు శ్రీధర్, బాబురావు, నాయకులు శ్రీనివాసరెడ్డి, శివరాజ్, నాగేశ్, శేషగిరి తదితరులున్నారు.