Anupama – Dhruv | మలయాళ భామగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, తెలుగు–తమిళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అనుపమ పరమేశ్వరన్ గురించి గత కొన్ని రోజులుగా ఆసక్తికరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కమర్షియల్ బ్లాక్బస్టర్లు లేకపోయినా, స్టార్ హీరోల సరసన పెద్ద సినిమాలు చేయకపోయినా చిన్న, మీడియం రేంజ్ చిత్రాలతో బిజీగా ఉన్న అనుపమ.. సోషల్ మీడియాలో మాత్రం మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఒకప్పుడు పద్ధతి గల పాత్రలతో మాత్రమే కనిపించిన అనుపమ, గత కొంతకాలంగా రొమాంటిక్ సీన్స్, లిప్ కిస్ సన్నివేశాలు ఉన్న పాత్రలను కూడా స్వీకరిస్తోంది. దీంతో ఆమె తన స్క్రీన్ ఇమేజ్ను మార్చుకుంటోందన్న చర్చలు కూడా జరిగాయి. నటిగా మరింత విభిన్న పాత్రలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ మార్పు అంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇటీవల ధృవ్ విక్రమ్ సరసన అనుపమ నటించిన తమిళ చిత్రం ‘బైసన్’ (Bison) విడుదలకు ముందు నుంచే ఈ ఇద్దరి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారిందన్న వార్తలు వినిపించాయి. సినిమాలో వీరిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ ఉండటంతో పాటు కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ధృవ్, ప్రముఖ నటుడు విక్రమ్ కుమారుడు కావడం కూడా ఈ రూమర్స్‌కు మరింత ఆసక్తిని జోడించింది. సినిమా ప్రమోషన్స్, పబ్లిక్ ఈవెంట్లలో కూడా అనుపమ–ధృవ్ కలిసి కనిపించడం రూమర్స్‌కు ఊతమిచ్చింది. ఇటీవల ఓ ఈవెంట్లో స్టేజ్‌పైనే ధృవ్‌కు అనుపమ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పగా, ఆమె సిగ్గుపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇక మరో ఈవెంట్లో ఇద్దరూ క్లోజ్‌గా దిగిన సెల్ఫీలు నెట్టింట హల్చల్ సృష్టించాయి. ఆ ఫొటోలను వీరిద్దరూ తమ తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేయడం గమనార్హం.ఓ ఇంటర్వ్యూలో “అర్ధరాత్రి కాల్ చేయాల్సి వస్తే ఎవరికి చేస్తారు?” అనే ప్రశ్నకు అనుపమ ధృవ్ విక్రమ్ పేరే చెప్పడం కూడా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం అనుపమ వయస్సు 30 సంవత్సరాలు కాగా, ధృవ్ విక్రమ్ 28 ఏళ్లు. దీంతో “తనకంటే రెండేళ్లు చిన్నవాడితో ప్రేమలో ఉందా?” అన్న చర్చ కూడా నెటిజన్లలో మొదలైంది. అయితే ప్రేమా? లేక మంచి స్నేహమా? అన్నది మాత్రం స్పష్టతకు రాలేదు. ఈ రూమర్స్‌పై ఇప్పటివరకు అనుపమ కానీ, ధృవ్ కానీ అధికారికంగా స్పందించలేదు. దీంతో అభిమానులు, నెటిజన్లు ఊహాగానాలకే పరిమితమవుతున్నారు. మరి వీరిద్దరి మధ్య నిజంగా ప్రేమ నడుస్తోందా? లేక ఇది కేవలం స్నేహమేనా? అన్నదానికి సమాధానం రావాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే. అప్పటివరకు ఈ డేటింగ్ రూమర్స్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి.