Allu Sirish | అల్లు కుటుంబంలో శుభకార్యం సందడి మొదలైంది. అల్లు శిరీష్ తాను ప్రేమించిన నయనికతో మార్చి 6న వివాహ బంధంలో అడుగుపెట్టనున్నాడు. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. వెడ్డింగ్ కార్డుల పంపిణీతో పాటు ప్రీ వెడ్డింగ్ వేడుకలు కూడా ప్రారంభమయ్యాయి. తమ్ముడి పెళ్లి సందర్భంగా అల్లు అర్జున్ ప్రత్యేకంగా ప్రీ వెడ్డింగ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు.ఈ సందర్భంగా తీసుకున్న ఓ స్పెషల్ గ్రూప్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ ఫొటోలో అల్లు శిరీష్, అతనికి కాబోయే భార్య నయనిక, అల్లు అర్జున్ , ఆయన భార్య స్నేహారెడ్డి, అలాగే రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన కలిసి కనిపించారు. మెగా–అల్లు కుటుంబానికి చెందిన కజిన్స్ అంతా ఒకే ఫ్రేమ్‌లో మెరిసిపోవడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పార్టీకి హాజరైన వారంతా బ్లాక్ డ్రెస్ కోడ్‌లో రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్టైలిష్ లుక్‌లో మెరిసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ ఫొటోలో మరో విశేషం ఏంటంటే రామ్ చరణ్ అయ్యప్ప మాల ధరించి కనిపించడం. చరణ్ సమయం దొరికినప్పుడల్లా అయ్యప్ప మాల వేసుకుంటారని తెలిసిందే. తాజా ప్రీ వెడ్డింగ్ వేడుకలో కూడా ఆయన మాలలో దర్శనమివ్వడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
అల్లు–మెగా అభిమానులు ఈ ఫోటోను సోషల్ మీడియాలో భారీగా షేర్ చేస్తున్నారు. “కుటుంబ బంధం ఇదే”, “మెగా–అల్లు యూనిటీ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి, అల్లు శిరీష్ పెళ్లి వేడుకలు ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. మార్చి 6న జరగనున్న ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇక అల్లు అర్జున్.. అట్లీతో కలిసి క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు.