దుగ్గొండి, మే, 01: ప్రపంచం నలుమూలన కష్టపడే కార్మిక, కర్షక, శ్రామిక శక్తులతో ఐక్యంగా ఉన్నప్పుడే కార్మికుల హక్కులను సాధించుకోవచ్చని తెలంగాణ ఆటో డ్రైవర్ యూనియన్ రాష్ట్ర సలహాదారు శానబోయిన రాజ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం మే డే సందర్భంగా మండల వ్యాప్తంగా గిర్నిబావి సెంటర్లో ఏఐటీయూసీ, సిఐటియు, హమాలి, ట్రాక్టర్ డ్రైవర్స్ యూనియన్, పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఆటో డ్రైవర్ యూనియన్ మండల అధ్యక్షుడు బూర రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో సెంటర్లో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు నరసింహ, దండు రాజు, గైని భాస్కర్, తిప్పి శంకర్, పొగాకు దేవేందర్, గోవిందు అశోక్, రవిచందర్, ఎండీ పాషా, చల్ల సురేష్, బుర్రి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.