నెక్కొండ, సెప్టెంబర్ 8: సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి, ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో విపక్షాల నాయకులు, కార్యకర్తలు భారీగా బీఆర్ఎస్లో చేరుతున్నారని, దీంతో పార్టీలోకి రోజురోజుకూ వలసలు పెరుగిపోతున్నాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని పెద్దకోర్పోలు నుంచి 80 కాంగ్రెస్ పార్టీకి చెందిన కుటుంబాలు సర్పంచ్ మహబూబ్‌పాషా ఆధ్వర్యంలో శుక్రవారం బీఆర్ఎస్లో చేరాయి. నెక్కొండలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్ది వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా నియోజవర్గంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. అభివృద్ధిలో రాష్ట్రంలోనే నర్సంపేట నియోజకవర్గం అగ్రభాగాన నిలుస్తున్నదన్నారు. చీకటి పాలన సాగించాలనుకంటే మాజీ ఎమ్మెల్యేలు రిటైర్మెంట్ తీసుకోవడం మంచిని పలికారు.
నిత్యం ప్రజల మధ్యే ఉంటూ..
ప్రతిపక్షాల మాదిరిగా తమది మేకప్, ప్యాకప్ మనస్తత్వం కాదని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి, సుపరిపాలన అందించే విషయంలో తనకు ఎలాంటి తారతమ్యాలు ఉందని స్పష్టం చేశారు. ఇకనైనా ప్రతిపక్షాలు వక్రబుద్ధిని మార్చుకోవాలని సూచించారు. గ్రామాల్లో చిచ్చుపెట్టి, ప్రజల్లో ఐకత్యను చెడగొట్టి ఇన్నాళ్లు చీకటి పాలన అందించారన్నారు. ఇకనైనా ఫుల్స్టాప్ పెట్టి విశ్రాంతి తీసుకుంటే మంచిదని హితవు పలికారు. రాజకీయాలకతీతంగా పంట నష్టపరిహారం చెక్కుల పంపిణీ కొనసాగిస్తుంటే కావాలని ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవపట్టిస్తున్నాయని విమర్శించారు. పరిహారం చెక్కులు తీసుకున్న నాయకులే ధర్నాలో పాల్గొనడం ఏంటని ప్రశ్నించారు. ఇటీవల రూ. 75 కోట్లతో ఆధునిక వ్యవసాయ యంత్రాల పరికరాలు, పనిముట్లు మంజూరు చేశామన్నారు. ఎవరైనా అర్హులకు పరిహారం అందకుంటే, ఇతర పథకాలతో భర్తీ చేసేలా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు.
పల్లెలన్నీ బీఆర్ఎస్ వైపే ఉండడంతో ఓర్వలేక ప్రతిపక్ష నేతలు చౌకబారు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత ఏప్రిల్ 9 జరిగిన పంట నష్టపరిహారం చెక్కులు ఇంకా అందాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జాటోత్ రమేశ్, సొసైటీ చైర్మన్ మారం రాము, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, ప్రధాన కార్యదర్శి తాటిపెల్లి శివకుమార్, నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేవ్యాదవ్, సీనియర్ నాయకులు చల్లా చెన్నకేశవరెడ్డి, గుంటుక సోమయ్య, బొల్లెబోయిన వీరస్వామి, దొనికెన సారంగంతోపాటు సర్పంచ్‌లు, పెద్దకోర్పోలుకు చెందిన బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కాగా, పంట నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యేకు సాయిరెడ్డిపల్లి నుంచే రైతులు పెద్ద సంఖ్యలో అపూర్వ స్వాగతం పలికారు. సాయిరెడ్డిపల్లి నుంచి బైక్‌పై ర్యాలీగా పెద్ది రెడ్లవాడకు చేరుకున్నారు. అలాగే, నెక్కొండకు చెందిన పుల్లూరి సత్యవతికి రూ. 2 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే పెద్ది అందించారు.
బీఆర్ఎస్లో చేరిన వారు వీరే..
తకెళ్ల బాబు, ఎల్లయ్య, మహేందర్, దాసరి యాకయ్య, మహేందర్, చెరుకు శ్రావణ్, శ్రీకాంత్, సాయికుమార్, వట్లె అఖిల్, కుమారస్వామి, బిర్రు సాయిలు, మైసయ్య, లక్ష్మీనర్సు, బిర్రు అశోక్, మట్టె స్వామి, బిర్రు లక్ష్మి, సుగుణ, రేణుక, రమ, వెంకటమ్మ, మట్టె రవళి, బిర్కు సమ్మక్క, దుర్గం కనకరాజు, నరేశ్, నిఖిల్, చిలువేరు రాములు, గౌరీ కుమారస్వామి, దుర్గం యాదయ్య, ఎల్లయ్య, బిర్రు కోమల, బిర్రు లక్ష్మణ్, దుర్గం సురేశ్, రామ్మూర్తి, జమాండ్ల అశోక్, బిర్రు సంపత్, రమేశ్, నవీన్, రాజేందర్, సుధాకర్, లక్ష్మణ్, సతీశ్, సంపత్, ప్రశాంత్, నాగరాజు, మనోహర్, రాఘవయ్య, నితిన్, సందీప్, సునీల్, అశోక్, మట్ట సతీశ్, యాకూబ్, మట్ట చేరాలు, సతీశ్, యాకూబ్, స్వామి, రాములు, బుచ్చిరెడ్డి, వెంకన్న, శ్రీనివాస్, సుధాకర్, సునీల్, ఎల్లయ్య, సారయ్య, అన్వేశ్, రవికుమార్, భాస్కర్, రాజు, కృష్ణ, సునీల్, చంద్రయ్య, వెంకటయ్య, శివమణి, మహేందర్, వెంపటి వెంకన్న బీఆర్ఎస్లో చేరిన వారిలో ఉన్నారు.
నియోజకవర్గంలో కాంగ్రెస్ కుదేలు
నల్లబెల్లి: నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్కు వస్తున్న ఆదరణను చూసి కాంగ్రెస్ పార్టీ కుదేలవుతున్నదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని రామతీర్థం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు పొదిల శోభన్, సొసైటీ మాజీ డైరెక్టర్ కామెర విమల ఆధ్వర్యంలో ఆ పార్టీకి చెందిన 15 కుటుంబాలు నర్సంపేటలోని క్యాంపు కార్యాలయంలో పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకులు ఏనాడు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. సొంత కాంట్రాక్టు పనులకే అధిక ప్రాధాన్యం ఇచ్చే వారని విమర్శించారు. తద్వారా నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన ఐదేళ్లలోనే నర్సంపేట డివిజన్‌ను ఎంతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ చెట్టుపెల్లి మురళీధర్‌రావు, మాజీ ఎంపీపీ బానోత్ సారంగపాణి, సర్పంచ్ కలకోటి కిరణ్, క్టస్టర్ ఇన్చార్జి మాలోత్ ప్రతాప్‌సింగ్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరిన సీనియర్ నేతలు
చెన్నారావుపేట: చెరువుకొమ్ముతండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భూక్యా ఉమ్లా, భూక్యా స్వామి, భూక్యా రాజు ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే సత్తా ఒక్క సీఎం కేసీఆర్‌కే ఉందన్నారు. బీఆర్ఎస్తోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని ప్రజలు బలంగా నమ్ముతున్నారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు బోడ బద్దూనాయక్, బోడ మురళి పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలకు ఆకర్షితులై..
నర్సంపేటరూరల్: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి చాలామంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆకులతండాకు చెందిన పది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దామెర గణేశ్, దామెర రాజు, నల్లతీగల శ్రీకాంత్, బోయిని రాకేశ్‌తోపాటు మరికొందరు ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు భూక్యా కిషన్‌నాయక్, రమేశ్, రాజు, సాంబయ్య, కుమారస్వామి పాల్గొన్నారు.